Medak: మెదక్ జిల్లాలో విషాదం.. గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం!

Medak: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల చెక్ డ్యాంలో సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది.

NAGARAJ, MEDAK
Published on: 23 Jun 2026 3:56 PM IST
Medak
X

Medak: మెదక్ జిల్లాలో విషాదం.. గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం!

మెదక్: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల చెక్ డ్యాంలో సుమారు 55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం చెక్ డ్యాంలో వృద్ధురాలి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పాపన్నపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతురాలి ఆచూకీ కోసం పరిశీలించినప్పటికీ ఎలాంటి వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

మృతురాలు బ్లూ కలర్ నైటీ ధరించి ఉండగా, చెవులకు రెడీమేడ్ కమ్మలు, ముక్కుకు పుడక ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి ఫోటో ఆధారంగా ఎవరైనా గుర్తించినట్లయితే పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఫోన్:87126 57920, ఫోన్:87126578830.సంప్రదించాలని పోలీసులు కోరారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story