Siddipet: హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా వన మహోత్సవం!

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 1వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో వన మహోత్సవం. మొక్కలు నాటి సంరక్షించాలని చైర్‌పర్సన్ దండి లక్ష్మి పిలుపు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 25 Aug 2026 1:06 PM IST
Siddipet
X

Siddipet: హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా వన మహోత్సవం!

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 1 వ వార్డ్ లో వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటిని సంరక్షించి పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలు, రహదారుల వెంట మరియు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణాన్ని పచ్చదనం మరియు పరిశుభ్రతలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో వైస్ చైర్ పర్సన్ పద్మ ,FRO సిద్ధార్థ్ ,కౌన్సిలర్స్ అనూష , లత , తిరుపతి , బొలిశెట్టి రాజు , సంపత్ ,మంజుల , వరప్రసాద్ , రమేష్ , వైద్యం కిరణ్ ప్రసాద్ , స్వరూప , కో ఆప్షన్ సభ్యులు గ్లోరినా , ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story