Sangareddy: దౌల్తాబాద్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు!

Sangareddy; దౌల్తాబాద్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు: కాలు, వేలు ఫ్రాక్చర్, నర్సాపూర్ విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు, బస్సు పీఎస్‌కు తరలింపు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 28 Sept 2026 7:31 PM IST
Sangareddy
X

Sangareddy: దౌల్తాబాద్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు!

సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం దౌల్తాబాద్ బస్టాండ్‌లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఎక్కే ప్రయత్నంలో ఓ విద్యార్థిని అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ మండలం కాగజ్‌ముద్దు గ్రామానికి చెందిన కుసంగి సంజన దౌల్తాబాద్‌లోని సాయి రిషి వొకేషనల్ కాలేజీలో చదువుతోంది.

కాలేజీ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న ఆమె.. బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా కదలడంతో అదుపుతప్పి చక్రాల కింద పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సంజన కాలుకు ఫ్రాక్చర్ కావడంతో పాటు బొటనవేలు పక్కనున్న వేలు కూడా విరిగినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే బస్సును పూర్తిగా నిలపకుండానే డ్రైవర్ ముందుకు కదిలించడంతోనే ప్రమాదం జరిగిందని తోటి విద్యార్థులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దౌల్తాబాద్ బస్టాండ్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కోసం ఆర్టీసీ బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR