Narsapur: నర్సాపూర్‌లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం. తన భూమి హద్దులు చూపడం లేదని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన.

G Ashok Reddy, Narsapur
Published on: 10 Jun 2026 1:33 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం!

మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వీరమణి అనే మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించింది.

శివంపేట్ మండలంలోని దొంతి గ్రామంలో నున్న 234 సర్వే నంబర్లో ఉన్న 1.21 గుంటల భూమి ని గత రెండేళ్లుగా తన భూమికి సంబంధించిన సర్వే నిర్వహించినప్పటికీ అధికారులు తన భూమి హద్దులను స్పష్టంగా చూపించడం లేదని ఆమె ఆరోపించింది. తమ భూమిపై కన్నేసిన బడాబాబులు రెవెన్యూ అధికారులు భూమి హద్దులు చూపించకుండా అడ్డు పడుతున్నారని ఆరోపించారు పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు దిగినట్లు తెలిపింది.

అది గమనించిన రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె దగ్గర నుండి పెట్రోల్ డబ్బా తీసుకొని మహిళా రైతుతో అధికారులు మాట్లాడి ఆమె సమస్యపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనతో ఆర్డీవో కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతు భూమి వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే సర్వే చేసి మహిళా రైతు భూమి హద్దులు చూపిస్తామని అధికారులు పేర్కొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story