Narayankhed: ప్రభుత్వ బడుల అభివృద్ధికి ఎంపీ హామీ.. నారాయణఖేడ్ లో విద్యా వారోత్సవాల జోరు
Narayankhed: నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలను జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ ప్రారంభించారు.
Narayankhed: ప్రభుత్వ బడుల అభివృద్ధికి ఎంపీ హామీ.. నారాయణఖేడ్ లో విద్యా వారోత్సవాల జోరు
నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు గౌరవ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ గారు ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొని విద్యా వారోత్సవాల ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ..
“విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను అన్ని విధాలుగా బలోపేతం చేస్తాం” అని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శంకరాయ్య స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల మరియు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




