Siddipet: సమ్మె నిర్ణయం విరమించుకోవాలి ఆటో డ్రైవర్లకు మంత్రి విజ్ఞప్తి

Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. ఆటో కార్మికులకు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన.

CH SRINIVAS, HUSNABAD
Published on: 23 Aug 2026 2:03 PM IST
Siddipet
X

Siddipet: సమ్మె నిర్ణయం విరమించుకోవాలి ఆటో డ్రైవర్లకు మంత్రి విజ్ఞప్తి

Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు గ్రామాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అనంతరం మంత్రి మీడియాతో ఆటో కార్మికుల సమస్యలపై మాట్లాడారు.

ఆటో కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.డీజిల్, పెట్రోల్ ఆటో లను రేటిరోఫిట్మెంట్ చేసుకోవడానికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తున్నామని,2015 తర్వాత ఆటో చార్జీలను పెంచలేదు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,కేబినెట్ లో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము.హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్మెంట్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని,పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వo సహకారం చేస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌లో దశలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి విధానంతో వారికి మరింత ప్రయోజనం కల్పించవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story