Dharmasthala Niyojakavargam Movie Review: ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. గ్రిప్పింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా!
Dharmasthala Niyojakavargam Movie Review: సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా రివ్యూ..
Dharmasthala Niyojakavargam Movie Review: ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. గ్రిప్పింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా!
Dharmasthala Niyojakavargam Movie Review: సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. మేరుం భాస్కర్ నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు బైర్రాజు (సాయికుమార్). అదే ప్రాంతంలో కాలేజీని నడుపుతూ వాసుదేవ్ (రాజీవ్ కనకాల), ఆయన భార్య కస్తూరి డ్రగ్స్ దందా నడిపిస్తుంటారు. విద్యార్థులను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్న ఈ ముఠాను.. అదే కాలేజీ లెక్చరర్ అరుంధతి (వితికా షేరు), స్టూడెంట్స్ బద్రి (నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) ఎదిరిస్తారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలతోనే తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న టీ కొట్టు నడుపుకునే ఈశ్వరయ్య (సుమన్).. రాజకీయాల్లోకి వచ్చి బైర్రాజుపై పోటీకి దిగుతాడు. ధనబలం, బలగం ఉన్న ఎమ్మెల్యేను ఒక సామాన్య టీ అమ్ముకునే ఈశ్వరయ్య ఎలా ఓడించాడు అనేదే ఈ చిత్ర అసలు కథ.
విశ్లేషణ:
సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా వంటి సమకాలీన అంశాన్ని తీసుకుని, దానికి బలమైన రాజకీయ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న విద్యార్థులు, హీరో హత్య మరియు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో సినిమా పూర్తిగా వేగమందుకుంటుంది. బైర్రాజుపై ఈశ్వరయ్య చేసే పొలిటికల్ క్యాంపెయిన్, లెక్చరర్ అరుంధతి ప్రతీకార వేదం ప్రేక్షకులకు గూస్‌బమ్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వరుణ్ సందేశ్ పాత్ర ద్వారా ప్రజాస్వామ్యంలో ‘ఒక ఓటు విలువ’ ఎంత ముఖ్యమో చెప్పిన విధానం ఆలోచింపజేస్తుంది.
నటీనటుల పనితీరు:
సాధారణ టీ కొట్టు వ్యక్తిగా, ఆ తర్వాత రాజకీయ నేతగా ఈశ్వరయ్య పాత్రలో సుమన్ చాలా పరిణతితో నటించారు. ముఖ్యంగా ఉచిత పథకాల వల్ల కలిగే నష్టాలపై ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా సాయికుమార్ తన అనుభవాన్ని పూర్తిగా రంగరించి జీవించారు. చాలా రోజుల తర్వాత రాజీవ్ కనకాల అత్యంత క్రూరమైన విలన్ పాత్రలో మెప్పించారు. కస్తూరి నెగెటివ్ షేడ్ ఉన్న రోల్‌లో ఒదిగిపోయారు. నటరాజ్, రాయంచ కొక్కుర, శివకుమార్ తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.
సాంకేతిక నిపుణులు:
తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట పొలిటికల్ డ్రామాను ఎక్కడా తడబడకుండా ఎంగేజింగ్‌గా నడిపించారు. మహావీర్ ఏలేందర్ సంగీతం, చంద్రబోస్ అర్థవంతమైన సాహిత్యం సినిమాకు అదనపు బలం చేకూర్చాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను రిచ్‌గా చూపించింది. నిర్మాత మేరుం భాస్కర్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా క్వాలిటీలో స్పష్టంగా కనిపిస్తాయి.
రేటింగ్: 3/5




