Lenin Twitter Review: 'లెనిన్' ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఏంటి ఇలా ఉంది!
Lenin Twitter Review: అక్కినేని అఖిల్ మోస్ట్ అవేటెడ్ రూరల్ డ్రామా 'లెనిన్' నేడు థియేటర్లలోకి వచ్చేసింది.
Lenin Twitter Review: 'లెనిన్' ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఏంటి ఇలా ఉంది!
Akhil Akkineni: అక్కినేని అఖిల్ మాస్ మేకోవర్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ లవ్, ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ‘లెనిన్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చాక నెటిజన్లు, క్రిటిక్స్ నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుందో.. సినిమా ప్లస్, మైనస్ పాయింట్లు ఏంటో చూద్దాం.
నెటిజన్ల రిపోర్ట్స్ ప్రకారం.. ‘లెనిన్’ ఒక ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో మహాభారత సూచనలను బ్లెండ్ చేసిన విధానం, దర్శకుడి మేకింగ్ విజన్ బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల ఫార్ములా సీన్లు, సాగతీత ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా సినిమా మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. క్రిటిక్స్ ఈ చిత్రానికి సగటున 2.5 నుంచి 3/5 రేటింగ్ ఇస్తున్నారు.
సినిమా ప్రారంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ థియేటర్లలో ఓ రేంజ్‌లో కనెక్ట్ అయింది. ఇది సినిమాకు ఒక గ్రాండ్ సెటప్‌ను ఇచ్చిందని ఆడియన్స్ చెబుతున్నారు. అఖిల్ అక్కినేని ఈ రూరల్ మాస్ క్యారెక్టర్‌లో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక కీలకమైన బ్లాక్‌లో అఖిల్ నటన వన్ మ్యాన్ షోలా సాగింది. అయ్యగారు మాస్ రాంపేజ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సినిమాకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్‌స్టాండింగ్‌గా ఉంది. యాక్షన్, ఎమోషనల్ సీన్లను థమన్ తన మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి వచ్చే ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ అస్సలు ఊహించని ట్విస్టులతో సాలిడ్‌గా డిజైన్ చేశారు. ఇవి సెకండ్ హాఫ్‌పై మంచి క్యూరియాసిటీని పెంచుతాయి.
హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ బాగుంది. కీలక పాత్రలో శివాజీ నటన సాలిడ్‌గా నిలవగా.. రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు మంచి రిచ్ అండ్ రూటెడ్ లుక్ తీసుకొచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని భాగాలు కాస్త నెమ్మదిగా సాగాయని, కొంతవరకు పాత ఫార్ములా పద్ధతిలోనే కథనం నడిచిందని కొందరు క్రిటిక్స్ పేర్కొన్నారు. కథకు కీలకమైన లవ్ ట్రాక్ అనుకున్నంత బలంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమాలో పాత్రల మధ్య మరింత బలమైన భావోద్వేగాలను పండించే స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనేది కొందరి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ‘లెనిన్’ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రూరల్ యాక్షన్ డ్రామా.
అక్కడక్కడా కథనంలో స్లో పేస్ ఉన్నా.. థమన్ బిజీఎం, అఖిల్ మాస్ పర్ఫార్మెన్స్, మరియు ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు సినిమాను నిలబెట్టాయి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న రూరల్ డ్రామాను చూడాలనుకునే వారికి, అలాగే అఖిల్ అక్కినేని సరికొత్త మాస్ అవతారాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక వన్ టైమ్ వాచ్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.




