Made In India Titan Story Review: ఒక నిర్ణయం.. భారతీయ వాచ్ ఇండస్ట్రీని మార్చేసింది.!

Made In India Titan Story Review: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వార్ట్జ్ వాచ్‌గా టైటాన్ ఎలా పుట్టింది.? ఈ విషయాలను మన కళ్ళకు కట్టేలా వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ "మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ".

G Krishna
Published on: 4 Jun 2026 7:08 AM IST
Made In India Titan Story Review
X

Made In India Titan Story Review: ఒక నిర్ణయం.. భారతీయ వాచ్ ఇండస్ట్రీని మార్చేసింది.!

Made In India Titan Story Review in Telugu : టాటా గ్రూప్‌కి చెందిన ఐకానిక్ వాచ్ బ్రాండ్ ‘టైటాన్’ గురించి మనందరికీ తెలిసిందే. కానీ, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వార్ట్జ్ వాచ్‌గా టైటాన్ ఎలా పుట్టింది.? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ విషయాలను మన కళ్ళకు కట్టేలా వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ "మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ". వినయ్ కామత్ రాసిన ఫేమస్ బుక్ ఆధారంగా దర్శకుడు రాబీ గ్రెవాల్ ఈ కార్పొరేట్ డ్రామాను తెరకెక్కించారు. ప్రస్తుతం అమెజాన్ MX ప్లేయర్ (Amazon MX Player) లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో, ఒకసారి ముచ్చటించుకుందాం..

అసలు కథేంటంటే..

ఈ కథ దశాబ్దాల క్రితం.. అంటే మన దేశంలో ఎకనామిక్ లిబరలైజేషన్ జరగకముందు, ‘మేడ్ ఇన్ ఇండియా’ అనేది ఒక పెద్ద నినాదంగా మారకముందు నాటి రోజుల్లో సాగుతుంది. అప్పట్లో నష్టాల్లో నడుస్తున్న ‘టాటా ప్రెస్’ అనే కంపెనీని ఎలాగైనా లాభాల్లోకి తీసుకురావాలని జిరాక్స్ దేశాయ్ (జిమ్ సర్భ్) అనే ఒక విజనరీ లీడర్‌కి జె.ఆర్.డి. టాటా (నసీరుద్దీన్ షా) బాధ్యతలు అప్పగిస్తారు. అయితే టాటా ప్రెస్‌ను మార్చడం కంటే, సరికొత్తగా ఒక గడియారాల ఫ్యాక్టరీని పెడితే బాగుంటుందని దేశాయ్ ఐడియా ఇస్తారు. మొదట్లో జె.ఆర్.డి. దీన్ని ఒప్పుకోకపోయినా, ఆ తర్వాత 1978 మార్చిలో వాచ్‌ల తయారీ బాధ్యతను దేశాయ్‌కే అప్పగిస్తారు.

జె.ఆర్.డి. ఇచ్చిన సపోర్ట్‌తో దేశాయ్ ఒక క్రేజీ టీమ్‌ని సెట్ చేసుకుంటారు. అందులో ఆయన నమ్మకమైన ఫ్రెండ్ ఆకాష్ బన్సల్ (వైభవ్ తత్వడి), ఐఐటి గ్రాడ్యుయేట్ గౌరవ్ ధర్ (లక్ష్వీర్ సింగ్ శరణ్), మొండి పట్టుదల గల మేఘా మహాత్రే (కావేరి సేథ్) ఉంటారు. అప్పటికే మార్కెట్‌ను ఏలుతున్న 'HMT' బ్రాండ్‌ను, అలాగే భారతీయులకు ఉన్న కీ ఇచ్చుకునే పాత అలవాటును మార్చేస్తూ.. 1980ల చివరలో ‘టైటాన్’ వాచ్‌ను వీళ్లు ఎలా లాంచ్ చేశారు అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ.

ఎలా ఉందంటే? (ప్లస్ & మైనస్ పాయింట్లు)

ఈ వెబ్ సిరీస్ ఒక బ్రాండ్‌ను సున్నా నుండి ఎలా బిల్డ్ చేశారు, కస్టమర్ల నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నారు అనే విషయాలను చాలా సింపుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తుంది. 80ల నాటి పాత ఆఫీసులు, ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ఫైళ్లు, నాటి వర్క్ కల్చర్‌ను స్క్రీన్‌పై అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఆనాటి బాలీవుడ్ పాటలు మనల్ని ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి.

అయితే, ఈ సిరీస్‌కి ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే.. దీని లెంగ్త్ , స్లోగా సాగే స్క్రీన్‌ప్లే. ఆరు ఎపిసోడ్‌ల కోసం దాదాపు ఆరున్నర గంటల టైమ్ తీసుకున్నారు. నిజానికి ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా సీన్లను ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఎంప్లాయ్స్‌కి వాచ్ ట్రైనింగ్ ఇచ్చే సీన్లు, హీరోయిన్ తల్లి పెళ్లి సంబంధాల కోసం చేసే గొడవలు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటి కొన్ని సబ్‌ప్లాట్లు పదేపదే రావడం వల్ల కథనంలో వేగం తగ్గి కాస్త బోర్ కొడుతుంది. హీరో భార్య రజనీ దేశాయ్ (నమిత దుబే) క్యారెక్టర్‌ను జస్ట్ అలా చూపించారే తప్ప, పెద్దగా స్కోప్ ఇవ్వలేదు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story