సందిగ్ధం మూవీ రివ్యూ.. ప్రేక్షకులను థ్రిల్ చేసే మిస్టరీ డ్రామా!

Sandigdham Movie Review: తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ ‘సందిగ్ధం’. మే 29న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? కథలో ఉన్న ట్విస్టులు ఏంటి? పూర్తి రివ్యూ ఇక్కడ చదవండి.

Sandigdham Movie Review
X

సందిగ్ధం మూవీ రివ్యూ.. ప్రేక్షకులను థ్రిల్ చేసే మిస్టరీ డ్రామా!

Sandigdham Movie Review: తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించగా, తెరచేప ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్రలో కనిపించారు. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ

క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ (నిహాల్) మేఘన (ప్రియా దేశ్‌పాగ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం గ్రామంలో హాస్పిటల్ నిర్మిస్తాడు. ఈ క్రమంలో దేవ్ జీవితంలోకి సత్య (అర్జున్), కళ్యాణి (కాజల్ తివారి) ప్రవేశిస్తారు. గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్‌కి మాత్రమే వారు కనిపించడం కథలో ఆసక్తిని పెంచుతుంది.

అసలు సత్య, కళ్యాణి ఎవరు? వారి గతం ఏమిటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి? అనే అంశాలతో సినిమా ముందుకు సాగుతుంది.

ఎలా ఉందంటే

సినిమా ఫస్ట్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలో నెమ్మదిగా కథను పరిచయం చేస్తూ సాగుతుంది. దేవ్ పాత్ర, అతని మంచితనం, మేఘనతో ప్రేమ కథ సహజంగా చూపించారు. సత్య, కళ్యాణి ఎంట్రీతో కథలో మిస్టరీ మొదలవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.

సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ అవుతూ సినిమా పూర్తిగా థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. క్రైమ్, సస్పెన్స్ అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

దేవ్ పాత్రలో నిహాల్ మంచి నటన కనబరిచాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘన పాత్రలో ప్రియా దేశ్‌పాగ్ అందంగా కనిపించడమే కాకుండా పాత్రకు తగ్గట్టుగా నటించింది.

అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో సహజమైన నటనతో మెప్పించారు. విలన్‌గా నవీన్ సంకరపు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

సాంకేతిక విభాగం

సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అడవులు, కొండ గ్రామం నేపథ్య విజువల్స్ సహజత్వంతో ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది.

డైలాగ్స్ కొన్ని చోట్ల హృదయాన్ని తాకేలా ఉన్నాయి. దర్శకుడు అనవసర కమర్షియల్ హంగులకు పోకుండా కథను నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఫైనల్‌గా

మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ‘సందిగ్ధం’ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండే ప్రయత్నం చేసింది. నెమ్మదిగా మొదలై తర్వాత ఆసక్తికర మలుపులతో సాగే ఈ చిత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది.

రేటింగ్: 2.75/5

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story