Terachapa Movie Review: 'తెరచాప' మూవీ రివ్యూ.. తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం!

Terachapa Movie Review: అనన్య క్రియేషన్స్ ‘తెరచాప’ మూవీ రివ్యూ. సముద్ర తీర నేపథ్యం, తండ్రి మరణం వెనుక మిస్టరీ.. నవీన్ రాజ్ నటన, జోయెల్ జార్జ్ దర్శకత్వంపై విశ్లేషణ.

Arun Chilukuri
Updated on: 17 April 2026 5:50 PM IST
Terachapa Movie Review
X

Terachapa Movie Review: 'తెరచాప' మూవీ రివ్యూ.. తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం!

రివ్యూ: తెరచాప

నటీనటులు: నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, రాజీవ్ కనకాల, రాకీ, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, రాజేష్ భూపతి తదితరులు

సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్

ఎడిటింగ్: రాజు బోడసింగి

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా

సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్

PRO: మధు VR

డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం

నిర్మాత: కైలాష్ దుర్గం

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్

విడుదల తేది: 17-4-2026

Terachapa Movie Review: అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మించిన చిత్రం ‘తెరచాప’. జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇప్పటికే ప్రమోషన్లతో ఆకర్షణ కలిగించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

సముద్రతీర గ్రామాన్ని నేపథ్యంగా తీసుకుని సాగిన ఈ కథలో తండ్రి-కొడుకు బంధం ప్రధానాంశంగా ఉంటుంది. గ్రామ ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు కాశీ బాబు అనూహ్యంగా మరణిస్తాడు. అందరూ అది సహజ మరణమని భావించినా, అతని కుమారుడు ఈశ్వర్‌కు అనుమానం కలుగుతుంది. తండ్రి మరణం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో గాయత్రి, సీత పాత్రలు ఎలా సహాయపడ్డాయి? ఆనంద్ రాజు, కేశవ పాత్రలు కథను ఎలా మలుపుతిప్పాయి? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈశ్వర్ పాత్రలో నవీన్ రాజ్ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. మత్స్యకారుడి పాత్రకు అతని లుక్ బాగా సరిపోయింది.

పూజా సుహాసిని క్లాసికల్ డ్యాన్సర్‌గా తన సాంప్రదాయ లుక్‌తో పాటు భావోద్వేగాలను చక్కగా వ్యక్తపరిచింది.

శ్రీలు మాస్ లుక్‌లో కొత్తగా కనిపిస్తూ, తన పాత్రలోని భావాలను బలంగా చూపించింది.

రాజీవ్ కనకాల, నాగ మహేష్ నటన సినిమాకు బలం. జగదీష్ ప్రతాప్ బండారి పాత్ర కూడా కథలో కీలకంగా నిలుస్తుంది.

విలన్ పాత్ర కూడా బలంగా ఉండి కథకు మంచి పోటీని ఇస్తుంది.

ఇతర సహాయ నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ, కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపిస్తుంది.

కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించడం, స్క్రీన్‌ప్లేలో చిన్న లోపాలు ఉండటం సినిమా ప్రభావాన్ని కొద్దిగా తగ్గిస్తాయి.

సాంకేతిక అంశాలు:

ప్రజల్ కృష్ణ అందించిన పాటలు వినసొంపుగా ఉంటాయి. ఎంఎల్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను బలపరుస్తుంది.

సినిమాటోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కచ్చితంగా ఉంది. తక్కువ బడ్జెట్‌లోనూ మంచి ప్రొడక్షన్ విల్యూస్ కనిపిస్తాయి.

ముగింపు:

‘తెరచాప’ ఒక సాధారణ కథను భావోద్వేగాలతో చెప్పిన గ్రామీణ డ్రామా. దర్శకుడు కథను సమర్థంగా తీసుకెళ్లగా, నటీనటుల ప్రదర్శనలు సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. ఈ వీకెండ్‌లో చూసేందుకు సరైన చిత్రం.

రేటింగ్: 3/5

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story