AA22 Update: అల్లు అర్జున్-అట్లీ కాంబో.. 'లయన్' హింట్‌తో సోషల్ మీడియా షేక్!
AA22 Update: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అట్లీ షేర్ చేసిన ఒక పవర్‌ఫుల్ పోస్టర్ ఈ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
AA22 Update: అల్లు అర్జున్-అట్లీ కాంబో.. 'లయన్' హింట్‌తో సోషల్ మీడియా షేక్!
టాలీవుడ్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ (AA22) రూపొందుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయిక. ఇందులో మరో ఇద్దరు కథానాయికలకు కూడా చోటున్నట్లు తెలుస్తోంది. 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 2027 నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అట్లీ షేర్ చేసిన ఒక పవర్‌ఫుల్ పోస్టర్ ఈ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
ఆసక్తి రేపుతున్న 'లయన్' పోస్టర్:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టర్‌లో ఒక సింహం ముఖాన్ని రెండు వేర్వేరు భాగాలుగా అట్లీ చూపించారు. దీనికి అట్లీ జోడించిన 'నీలా ఎవరూ ఉండలేరు, అదే నీ శక్తి' అనే కొటేషన్ సినిమా థీమ్‌పై ఒక క్లారిటీని ఇస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో బన్నీ క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. ముఖ్యంగా బన్నీ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం లేదా మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారనే హింట్‌ను అట్లీ ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు.
హాలీవుడ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ వండర్:
ఈ చిత్రం కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మాత్రమే కాకుండా.. హాలీవుడ్ ప్రమాణాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇందుకోసం మార్వెల్ సినిమాలైన స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ వంటి వాటికి పనిచేసిన వరల్డ్ క్లాస్ విఎఫ్క్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో ప్రజెంట్ చేయడానికి అట్లీ భారీ కసరత్తే చేస్తున్నారు.
భారీ తారాగణం:
ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో కూడా అట్లీ సంచలనం సృష్టిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన కథానాయికగా నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ ఇప్పటికే క్లారిటీ ఇస్తూ.. తాను ఈ సినిమాలో లేనని చెప్పారు. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి రాగా.. అది కూడా రూమరే అని తేలింది. ఇంతమంది క్రేజీ తారలు ఒకే సినిమాలో ఉండటం ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
ఏప్రిల్ 8న అసలైన బ్లాస్ట్:
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆ రోజే బన్నీ లుక్, సినిమా నేపథ్యంపై పూర్తి స్పష్టత రానుంది. ఏప్రిల్ 8 కోసం బన్నీ ఫాన్స్ ఆసక్తిగా చుస్తున్నారు.




