Tollywood: ప్రియుడి ఫొటోలను బయటపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో కూతురు
Tollywood: టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చిన్న కూతురు అంజనా వివాహం ఈ నెల 18న జరగనుంది.
Tollywood: ప్రియుడి ఫొటోలను బయటపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో కూతురు
Tollywood: దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన యాక్షన్ రోల్స్ తో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా కుటుంబంలోకి త్వరలో ఓ కొత్త అతిథి రానున్నారు. అర్జున్ చిన్న కూతురు అంజనా పెళ్లి ముహూర్తం ఖరారైంది. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత, పెద్దల అంగీకారంతో ఆమె తన ప్రియుడితో కలిసి ఏడడుగులు నడవనున్నారు.
అంజనాకు కాబోయే భర్త ఎవరనే వివరాలను కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటికానుండటంతో, అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కాబోయే దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చూడముచ్చటి జంట అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
అర్జున్ సర్జా కుటుంబం నుంచి పెద్ద కూతురు ఐశ్వర్య నటిగా రాణిస్తూ, తండ్రి వ్యాపార బాధ్యతలు కూడా చూసుకుంటుండగా.. చిన్న కూతురు అంజనా మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ ఒక విజయవంతమైన బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా 2023లో ఆమె ప్రారంభించిన హ్యాండ్ బ్యాగుల తయారీ సంస్థ ప్రత్యేకతను సంతరించుకుంది. పర్యావరణ హితంగా ఉండే ఈ బ్యాగులను కేవలం పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు, నేచురల్ నార వంటి వాటితోనే తయారు చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఆమె తయారు చేస్తున్న ఈ హ్యాండ్ బ్యాగులకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది.
ఇలా వ్యాపార రంగంలో రాణిస్తూనే, తన జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంజనా సిద్ధమయ్యారు. ఈ నెల 18న జరగబోయే ఈ వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. అర్జున్ కుటుంబంలో జరుగుతున్న ఈ వేడుకకు సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.




