The Paradise: నాని రిక్వెస్ట్‌కి సీఎం రేవంత్ ఫిదా.. 'ది ప్యారడైజ్' ప్రీమియర్‌పై గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కీలక ఆదేశాలు!

The Paradise: ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో 'ది ప్యారడైజ్' సినిమా ప్రీమియర్ షోకి అనుమతి కోరిన నాని అభ్యర్థనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 23 Sept 2026 11:34 AM IST
The Paradise
X

The Paradise: నాని రిక్వెస్ట్‌కి సీఎం రేవంత్ ఫిదా.. 'ది ప్యారడైజ్' ప్రీమియర్‌పై గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కీలక ఆదేశాలు!

The Paradise: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో అభిమానులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాని ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సానుకూలంగా స్పందించారు.

భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ నాని చేసిన అభ్యర్థనను, సినిమాపై ఆయన ఉన్న తపనను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జన సమూహాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రీమియర్ షో నిర్వహణ కోసం నిర్దేశిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం నానికి తెలిపారు. సంబంధిత పోలీసు బృందం ఆ దరఖాస్తును పరిశీలించి, భద్రతా నిబంధనలకు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి కూడా సీఎం సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.