Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గాయం.. కాలికి విజయవంతంగా శస్త్రచికిత్స!

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘బరి’ షూటింగ్ సాధనలో గాయపడ్డారు.

Arun Chilukuri
Published on: 15 April 2026 5:42 PM IST
Varun Tej
X

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గాయం.. కాలికి విజయవంతంగా శస్త్రచికిత్స!

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ‘బరి’ సినిమా కోసం వాలీబాల్ సాధన చేస్తున్న సమయంలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరుణ్‌కు శస్త్రచికిత్స నిర్వహించగా, అది విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల అధికారికంగా వెల్లడించారు.

‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరి’ చిత్రం వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు వరుణ్ గత ఏడు నెలలుగా వాలీబాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గాయపడాల్సి వచ్చింది.

"వరుణ్‌కు సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే మరింత శక్తిమంతంగా ఆయన తిరిగి వస్తారు. ఇలాంటి సమయంలో అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు" అని నిహారిక పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి (2027) బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తోంది. వరుణ్ కోలుకున్న తర్వాత మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story