Ashu Reddy: అషురెడ్డి ‘సీక్రెట్’ నిశ్చితార్థం.. వరుడు ఎవరో చెప్పకుండానే ఫోటోలు వైరల్!
Ashu Reddy: ఎన్నారైని పెళ్లి పేరుతో మోసం చేశారన్న కేసు విచారణలో ఉండగానే నటి అషురెడ్డి నిశ్చితార్థం చేసుకున్నారు. వరుడు ఎవరన్నది గోప్యంగా ఉంచి ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
Ashu Reddy: అషురెడ్డి ‘సీక్రెట్’ నిశ్చితార్థం.. వరుడు ఎవరో చెప్పకుండానే ఫోటోలు వైరల్!
Ashu Reddy: బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒకవైపు పెళ్లి పేరుతో ఎన్నారైని మోసం చేశారన్న ఆరోపణలు, కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలోనే.. ఆమె అనూహ్యంగా మరొకరితో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత కొంతకాలంగా మీడియా ముందుకు రాని అషురెడ్డి, తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మూడు ఫోటోలను పంచుకున్నారు. దండలు మార్చుకుని స్టేజీపై కూర్చున్న ఫోటో, మరొకరి చేతిలో చెయ్యి వేసిన ఫోటో మరియు ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో ఈ 'మిస్టరీ మ్యాన్' ఎవరనే దానిపై నెటిజన్లలో తీవ్ర చర్చ నడుస్తోంది.
లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారైని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అతని వద్ద నుంచి రూ. 9.5 కోట్లు తీసుకుని ఇప్పుడు నిరాకరించారనేది అషురెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ (CCS) పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. విచారణ కీలక దశలో ఉండగానే ఆమె నిశ్చితార్థం చేసుకోవడం గమనార్హం.
విశాఖపట్టణానికి చెందిన అషురెడ్డి, రాంగోపాల్ వర్మతో చేసిన వీడియోల ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించారు. అయితే, ప్రస్తుత వివాదాల నేపథ్యంలో ఆమె నిశ్చితార్థం చేసుకోవడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. "ఒకరిని మోసం చేసిన కేసు తేలకముందే ఇంకొకరితో నిశ్చితార్థమా?" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా అషురెడ్డి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించకపోవడం విశేషం.




