Ashu Reddy: నటి అషురెడ్డికి బిగ్ షాక్.. పోలీసుల నోటీసులు!

Ashu Reddy: నటి అషురెడ్డి మరియు ఆమె తల్లిదండ్రులపై రూ. 10.5 కోట్ల మోసం కేసు నమోదైంది. పెళ్లి పేరుతో ఎన్నారైని మోసం చేశారన్న ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేయగా, హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Arun Chilukuri
Published on: 8 May 2026 2:57 PM IST
Ashu Reddy
X

Ashu Reddy: నటి అషురెడ్డికి బిగ్ షాక్.. పోలీసుల నోటీసులు!

Ashu Reddy: ప్రముఖ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. పెళ్లి పేరుతో ఓ ఎన్నారైని మోసం చేసి రూ. 10.5 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

బాధితుడు ధర్మేంద్ర అనే ఎన్నారై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అషురెడ్డి, ధర్మేంద్రను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ. 10 కోట్ల 5 లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అషురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా పోలీసులు 41A నోటీసులు అందజేశారు. వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

తమపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను రద్దు చేయాలని (Quash), పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ అషురెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసుల దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు కోర్టు సమ్మతించలేదు. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story