Gayatri Gupta: నాకు మూడ్ వస్తే బికినీ వేసుకుంటా..యాంకర్‌కు నటి దిమ్మతిరిగే కౌంటర్..!

Gayatri Gupta: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై యాంకర్ అడిగిన ప్రశ్నకు గాయత్రి గుప్తా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. పద్ధతి అనేది డ్రెస్సులో ఉండదని స్పష్టం చేశారు.

Naresh.k
Published on: 30 April 2026 9:22 AM IST
Gayatri Gupta
X

Gayatri Gupta: నాకు మూడ్ వస్తే బికినీ వేసుకుంటా..యాంకర్‌కు నటి దిమ్మతిరిగే కౌంటర్..!

Bold Actress: తన నటనతోనే కాకుండా, బోల్డ్ స్టేట్‌మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి గాయత్రి గుప్తా మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆమె నటిస్తున్న ‘ఫస్ట్ టైమ్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన డ్రెస్సింగ్‌పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

చీరలో కనిపించగానే ప్రశ్నల వర్షం

సాధారణంగా సోషల్ మీడియాలో షార్ట్ డ్రెస్సులతో గ్లామరస్‌గా కనిపించే గాయత్రి, లేటెస్ట్ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చారు. ఇది చూసిన ఒక యాంకర్.. బిగ్ బాస్ శివాజీ చేసిన కామెంట్స్ వల్ల ఇలా మారారా? లేక సనాతన ధర్మాన్ని పాటిస్తూ చీర కట్టుకున్నారా? అని ప్రశ్నించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు గాయత్రి ఏమాత్రం తడుముకోకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. మీరు అడిగిన ఆ రెండు కారణాలు కరెక్ట్ కాదు. నేను బికినీ వేసుకుంటా, చీర కూడా కట్టుకుంటా. ఏది వేసుకోవాలనేది నా మూడ్ డిసైడ్ చేస్తుంది. చీర కట్టుకుంటేనే పద్ధతిగా ఉన్నట్లు, లేకపోతే లేనట్టు అని డ్రెస్ డిసైడ్ చేయదు. అంతా మనం చూసే విధానంలోనే ఉంటుంది. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటూ గట్టిగానే బదులిచ్చారు.

మే 22న 'ఫస్ట్ టైమ్' విడుదల

హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సౌరబ్ ధింగ్ర హీరోగా నటిస్తుండగా, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌తో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మే 22న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో గాయత్రి గుప్తా పోషించిన పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సమాచారం.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story