Hansika Motwani: విడాకుల తర్వాత హన్సిక తొలి రియాక్షన్.. 'చార్దీ కలా' అంటూ ఎమోషనల్ పోస్ట్!

Hansika Motwani: టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి అధికారికంగా ముగింపు పలికారు.

Arun Chilukuri
Published on: 13 March 2026 11:42 AM IST
Hansika Motwani: విడాకుల తర్వాత హన్సిక తొలి రియాక్షన్.. చార్దీ కలా అంటూ ఎమోషనల్ పోస్ట్!
X

Hansika Motwani: విడాకుల తర్వాత హన్సిక తొలి రియాక్షన్.. 'చార్దీ కలా' అంటూ ఎమోషనల్ పోస్ట్!

Hansika Motwani: టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి అధికారికంగా ముగింపు పలికారు. భర్త సోహైల్ కతూరియాతో విడిపోయిన తర్వాత ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన మొదటి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రతికూలతలోనూ ఆశ కోల్పోవద్దు:

విడాకుల ప్రక్రియ ముగిసిన అనంతరం హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంజాబీ పదం ‘చార్దీ కలా..’ (Chardi Kala) అని రాసుకొచ్చారు. దీని అర్థం "ఎల్లప్పుడూ ఉత్సాహంతో ముందుకు సాగాలి.. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోవద్దు" అని. ఈ పోస్ట్ ద్వారా ఆమె తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ధైర్యంగా ప్రారంభించబోతున్నట్లు సంకేతాలిచ్చారు.

రెండేళ్లకే ముగిసిన బంధం:

హన్సిక, సోహైల్ 2022 డిసెంబర్‌లో రాజస్థాన్ వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఒక డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా ఓటీటీలో విడుదల చేశారు. అయితే, గత ఏడాది ఆగస్టులో హన్సిక తన సోషల్ మీడియా ఖాతా నుండి పెళ్లి ఫోటోలను తొలగించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది. చివరకు ఈ ఏడాది మార్చి 11న కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం హన్సిక తన కెరీర్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. ఆమె ధైర్యాన్ని చూసి అభిమానులు సోషల్ మీడియాలో మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story