Harassment: సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రముఖ నటిపై అఘాయిత్యం.. కారులోనే దారుణంగా
Harassment: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సినీ నటిపై క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది.
Harassment: సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రముఖ నటిపై అఘాయిత్యం.. కారులోనే దారుణంగా
Casting Couch: వెండితెరపై మెరిసిపోవాలనే ఆశ.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలనే కల.. ఆ యువతి తాపత్రయాన్ని ఆసరాగా చేసుకున్నాడు ఓ కేటుగాడు. ఛాన్సుల పేరిట నమ్మించి, షూటింగ్ చేయించుకుని, తీరా పారితోషికం అడిగితే కారులో ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. టోలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోన్న ఈ ఘోర పాడుకృత్యం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సినిమాల్లో హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతికి ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సదరు నటి.. 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు జరిగిన షూటింగ్లో పాల్గొంది. అయితే, సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత అసలు రంగు బయటపెట్టాడు ప్రసాద్.ఆమెకు ఇవ్వాల్సిన రూ. 90 వేల పారితోషికంతో పాటు, ప్రయాణ ఖర్చుల కింద రావాల్సిన మరో రూ. 38 వేలు , మొత్తం రూ. 1.28 లక్షలు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకుంటూ కాలయాపన చేశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయిల విషయం మాట్లాడదామని, బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ నిర్మాత కార్యాలయం వద్దకు రావాలని సదరు నటిని ప్రసాద్ కోరాడు. డబ్బులు చేతికొస్తాయనే ఆశతో వెళ్లిన ఆ నటికి అక్కడ చుక్కెదురైంది. డబ్బులు ఇవ్వకపోగా ఆమెపై బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా, ఆమెను బలవంతంగా తన కారులోకి ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లాడు. ఇండస్ట్రీలో మరిన్ని పెద్ద అవకాశాలు ఇప్పిస్తా.. అందుకు బదులుగా నా కోరికలు తీర్చాలి అంటూ కారులోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు, అవమానానికి గురైన సదరు నటి.. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి చేరుకుంది.
కన్నీళ్లతో ఇంటికి వచ్చిన కూతురు తనకు జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె తల్లి, నిందితుడు ప్రసాద్‌కు ఫోన్ చేసి నిలదీసింది. అయితే, నిందితుడు ఏమాత్రం తగ్గకుండా ఆమెను కూడా తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.ప్రసాద్ వేధింపులు మితిమీరడంతో, ప్రాణభయం నీడలో ఉన్న సదరు నటి చివరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
తమకు ప్రాణరక్షణ కల్పించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినీ అవకాశాల ఆశ చూపి మహిళలను మోసం చేస్తూ, వేధించే ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రసాద్ లాంటి కొద్దిమంది కామాంధుల వల్ల మొత్తం సినీ ఇండస్ట్రీకే చెడ్డపేరు వస్తోందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.




