Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెగా హీరోయిన్

Mehreen Pirzada: టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ పిర్జాదా వివాహం ఘనంగా జరిగింది. ఆర్ష్ ఔలాఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

Naresh.k
Updated on: 27 April 2026 8:40 AM IST
Mehreen Pirzada
X

Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెగా హీరోయిన్

Mehreen Pirzada Wedding: టాలీవుడ్ చందమామ మెహరీన్ పిర్జాదా ఎట్టకేలకు ఒక ఇంటిదయ్యారు. గత కొన్నేళ్లుగా ఈమె పెళ్లి గురించి, వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు, మరెన్నో ఊహాగానాలు షికార్లు చేశాయి. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ, మెహరీన్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

గతంలో విఫలమైన నిశ్చితార్థం..

మెహరీన్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి నిశ్చితార్థం 2021 మార్చి 12న జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావిస్తున్న తరుణంలో, ఊహించని విధంగా అదే ఏడాది జూలైలో ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్లు మెహరీన్ అప్పట్లో ధైర్యంగా ప్రకటించి, తన కెరీర్‌పై దృష్టి పెట్టారు.

సీక్రెట్ పెళ్లి వార్తలు.. పుకార్లు

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత మెహరీన్ పేరు సోషల్ మీడియాలో నిరంతరం నానుతూనే ఉంది. గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ఈమె రిలేషన్‌లో ఉందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. అలాగే, ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. అయితే ఆ వార్తలను ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.

ఎట్టకేలకు ఆర్ష్ ఔలాఖ్‌తో ఏడడుగులు

తాజాగా, మెహరీన్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అత్యంత సన్నిహితులు ,కుటుంబ సభ్యుల సమక్షంలో ఆర్ష్ ఔలాఖ్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు.ఈ ఫోటోలలో మెహరీన్ పెళ్లి కూతురిగా ఎంతో అందంగా మెరిసిపోతున్నారు. తన వైవాహిక జీవితం గురించి ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్నో ఒడిదుడుకులు, వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత, మెహరీన్ తన మనసు మెచ్చిన వ్యక్తిని వెతుక్కుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story