టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Samantha Pregnancy: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. తాను తల్లి కాబోతున్నాననే తీపి కబురును ఆమె అధికారికంగా పంచుకున్నారు. ఈ వార్తతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆనందంలో మునిగిపోయాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన థాంక్యూ మీట్‌లో సమంత స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
నా కెరీర్‌ను ఎప్పుడూ ఆదరించే అభిమానులందరికీ థాంక్స్. అయితే నేను మళ్లీ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకోబోతున్నాను.. అందుకు ఫ్యాన్స్ నన్ను క్షమించాలి. నా మెటర్నిటీ లీవ్స్కోసమే ఈ చిన్న బ్రేక్" అంటూ సమంత అసలు విషయాన్ని బయటపెట్టారు. నిజానికి 'మా ఇంటి బంగారం' సినిమా ప్రమోషన్స్ సమయంలోనే సమంత బేబీ బంప్‌తో కనిపించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అనే ప్రచారం గట్టిగానే సాగింది.
ఇప్పుడు థాంక్యూ మీట్ వేదికగా సమంత ఆ వార్తలను నిజం చేస్తూ, ఎంతో సంతోషంగా తన ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేశారు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఆమె ముఖంలో మాతృత్వపు కల కనిపిస్తుండగా.. పక్కనే కూర్చున్న ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడమూరు కూడా ఎంతో మురిసిపోతూ కనిపించారు. సమంత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఎంతో కాలంగా సమంతకు ఒక మంచి తోడు, జీవితంలో సంతోషం దక్కాలని కోరుకుంటున్న అభిమానులు.. ఈ గుడ్ న్యూస్ వినగానే ఎమోషనల్ అవుతున్నారు.
కంగ్రాట్స్ సామ్.. నీ జీవితంలో ఈ కొత్త ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇవ్వాలి అని కొందరు, తల్లిదండ్రులు కాబోతున్న సమంత, రాజ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, అటు 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్.. ఇటు జీవితంలో అతిపెద్ద 'బంగారం' లాంటి గుడ్ న్యూస్ ఒకేసారి రావడంతో సమంత ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది.




