Actress Sudha: 'నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.?'.. డైరెక్టర్ బాలచందర్ అలా అనగానే షాకయ్యా.!

Actress Sudha: ప్రముఖ సీనియర్ నటి సుధ తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒక ఆసక్తికర సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Ravi
By Ravi
Published on: 29 July 2026 9:36 AM IST
Actress Sudha
X

Actress Sudha: 'నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.?'.. డైరెక్టర్ బాలచందర్ అలా అనగానే షాకయ్యా.!

Actress Sudha: ప్రముఖ సీనియర్ నటి సుధ తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒక ఆసక్తికర సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి సుధ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో కేవలం హీరోయిన్‌గానే కాకుండా తన విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాలని తన తల్లి ఎంతగానో ప్రోత్సహించారని సుధ గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుకోవడానికి వెళ్లినప్పుడు తన మనసు మాత్రం సినిమాలపైనే ఉండేదని తెలిపారు. ఆ తర్వాత లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ వద్ద నుంచి పిలుపు రావడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని వివరించారు.

అయితే సుధ మళ్లీ తిరిగొచ్చిన సమయంలో బాలచందర్ ఆమెను కూర్చోబెట్టి ఒక సూటి ప్రశ్న అడిగారట. "నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు గ్లామర్ పాత్రలకు పనికిరావు" అని ఆయన ముఖం మీదే చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని సుధ వెల్లడించారు. లేడీ ఓరియెంటెడ్ పాత్రలు లేదా హీరోయిన్ అవకాశాలు కేవలం కొన్నాళ్లు మాత్రమే వస్తాయని, వయసు పెరిగేకొద్దీ క్యారెక్టర్ రోల్స్‌కు మారక తప్పదని ఆయన ఎంతో క్లియర్‌గా వివరించారు. ప్రేక్షకులు వద్దనుకున్నప్పుడు, లేదా సెట్‌లో తనకంటే చిన్నవారితో ఎందుకు పనిచేయాలి అనే అహంకారం వచ్చినప్పుడు, లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు మాత్రమే రిటైర్ అవ్వాలని ఆయన ఇచ్చిన మూడు సలహాలు తన జీవితంలో మార్గదర్శకంగా నిలిచాయని సుధ ఎంతో సంతోషంగా పంచుకున్నారు.

కాగా, సుధ కెరీర్‌లో 'మన్మధుడు', 'గ్యాంగ్ లీడర్', 'దూకుడు' లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా మన్మధుడు చిత్రంలో తాను చేసిన పాత్ర, అందులోని ఉప్మా సీన్ తనకు ఎప్పటికీ ఫేవరెట్ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజ నటులతో పనిచేయడం వల్ల సెట్‌లో ఎంతో కంఫర్ట్‌గా ఉండేదని తెలిపారు. జీవితంలో ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే తన అందానికి అసలైన రహస్యం అని సుధ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story