Adarsha Kutumbam: 'నారాయణమ్మ' సాంగ్ సూపరో సూపర్..మరోసారి అదరగొట్టిన తమన్
Adarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం - AK47’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
Adarsha Kutumbam: 'నారాయణమ్మ' సాంగ్ సూపరో సూపర్..మరోసారి అదరగొట్టిన తమన్
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం - AK47’. పేరులోనే వైవిధ్యం ఉంటూ, ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ ఒక మాసెస్ అండ్ క్లాసెస్ మెచ్చే ట్రీట్‌ను అందించారు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌కు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టారు.
సమకాలీన ట్రెండ్‌కు తగినట్లుగా ఎస్. తమన్ అందించిన ఊపునిచ్చే సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది. ఇక రామ్ మిరియాల, ప్రభ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తెచ్చారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచీ సాహిత్యం శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటోంది. పండగ వాతావరణాన్ని తలపించే ఈ సాంగ్‌లో డింపుల్ హయాతి తన వైబ్రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే డాన్స్ మూవ్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెతో పాటు విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ సందడి చేయడంతో ఈ పాట యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మధ్యతరగతి కుటుంబంలో చోటుచేసుకునే స్వచ్ఛమైన వినోదం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఈ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వెంకటేష్ నటన సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ వంటి హ్యుజి కాస్టింగ్ నటిస్తోంది. ‘నారాయణమ్మ’ సాంగ్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోగా, సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ‘ఆదర్శ కుటుంబం - AK47’ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9, 2026న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరి ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.




