VV Vinayak: 'అదుర్స్ 2'పై వినాయక్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
VV Vinayak: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. 'అదుర్స్ 2'పై దర్శకుడు వి.వి.వినాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కల్ట్ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తీయకూడదో ఆయన వివరించారు.
VV Vinayak: 'అదుర్స్ 2'పై వినాయక్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
టాలీవుడ్‌లో ఒకప్పుడు 'చారి' పాత్ర సృష్టించిన మేజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా యూట్యూబ్‌లో ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ - బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చిన 'అదుర్స్' సినిమాకు సీక్వెల్ తీయాలని రచయిత కోన వెంకట్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని ఆయన ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో, తాజాగా అదుర్స్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు.
"మళ్ళీ అంత గొప్పగా తీయలేం"
ఇటీవల డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ.. 'అదుర్స్ 2' గురించి షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. "నిజం చెప్పాలంటే, అదుర్స్ కథ అక్కడితో ముగిసిపోయింది. ఇప్పుడు మళ్లీ అందులో కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. కేవలం సీక్వెల్ తీయాలి కదా అని బలవంతంగా తీస్తే, మొదటి భాగం అందించిన ఆ గొప్ప అనుభూతిని మళ్లీ తీసుకురాలేం" అని ఆయన స్పష్టం చేశారు. "అదుర్స్ మొదటి భాగాన్ని మించి లేదా అంత సమానంగా మళ్లీ తీయగలమన్న నమ్మకం నాకే లేదు. అందుకే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్" అని వినాయక్ కుండబద్దలు కొట్టారు. కొన్ని అద్భుతమైన సినిమాలను సీక్వెల్స్ పేరుతో పాడు చేయకుండా, ఒక మధుర జ్ఞాపకంగా వదిలేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వినాయక్ వ్యాఖ్యలతో 'అదుర్స్ 2'పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, ఒక కల్ట్ క్లాసిక్ సినిమా గౌరవాన్ని కాపాడాలనే ఆయన నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తరుణంలో, వినాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు 'అదుర్స్ 2' చాప్టర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ వేసినట్లే కనిపిస్తోంది.




