Vijay and Trisha: తమిళ రాజకీయంలో మరో తుపాను.. విజయ్, త్రిషలపై షాకింగ్ కామెంట్స్..!

Vijay and Trisha: టీవీకే అధినేత విజయ్, నటి త్రిషను ముడిపెడుతూ ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపాయి.

Naresh.k
Updated on: 12 Aug 2026 10:34 AM IST
Vijay and Trisha
X

Vijay and Trisha: తమిళ రాజకీయంలో మరో తుపాను.. విజయ్, త్రిషలపై షాకింగ్ కామెంట్స్..!

AIADMK: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా గ్లామర్, పొలిటికల్ పవర్ డ్రామాతో వేడెక్కుతుంటాయి. అయితే, తమిళగ వెట్రి కళగం అధినేత, సీఎం విజయ్, హీరోయిన్ త్రిషకు ముడిపెడుతూ ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఉదయకుమార్ మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన టీవీకే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం విజయ్ తనతో పనిచేసిన నిర్మాతలు, సాంకేతిక సిబ్బందికే ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెడుతున్నారని ఉదయకుమార్ ఆరోపించారు.

ఆలయ ట్రస్టీ, న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి, తమిళనాడు ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ హెడ్, ప్రభుత్వ సలహాదారులుగా విజయ్ సినిమాలకు పనిచేసిన వారినే నియమించారని విమర్శించారు. ఈ నియమకాల జాబితాను ఎత్తిచూపుతూ... "మరి అనేక చిత్రాల్లో విజయ్ సరసన నటించిన త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు? అంటూ ఉదయకుమార్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

హీరోయిన్ త్రిషను ఉద్దేశించి రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొద్దిరోజుల క్రితమే, డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యి, విచారణ అనంతరం విడుదలయ్యారు. అయితే తాను కేవలం కావేరి జలాల సమస్య గురించే మాట్లాడానని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అప్పట్లో ఉదయనిధి వివరణ ఇచ్చారు.

ఆ వివాదం చల్లారకముందే, ఇప్పుడు AIADMK మాజీ మంత్రి ఉదయకుమార్ నేరుగా త్రిష పేరును లాగుతూ సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకోవడం తమిళ రాజకీయాల్లో మరో పెద్ద చురకలు అంటిస్తోంది. సరికొత్త రాజకీయ పార్టీ పెట్టి సీఎం పీఠాన్ని దక్కించుకున్న విజయ్ పాలనపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అయితే, వ్యక్తిగత విమర్శలు, సినీ నటుల పేర్లను రాజకీయ వివాదాల్లోకి లాగడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, విజయ్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయకుమార్ వ్యాఖ్యలపై TVK వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story