Tollywood: ఈ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టారా.? సూర్యకు విలన్‌గా నటించి.. ఓవర్‌నైట్ ఫేమస్ అయ్యాడు.. ఎవరంటే.?

Tollywood: సూర్య 'వీడొక్కడే'లో విలన్‌గా నటించిన ఆకాశ్‌దీప్ సైగల్ 9 ఏళ్ల విరామం తర్వాత టీవీలో రీ ఎంట్రీ ఇచ్చారు, ముఖంలో వచ్చిన మార్పులతో గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 29 Nov 2026 8:30 AM IST
Tollywood
X

Tollywood: ఈ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టారా.? సూర్యకు విలన్‌గా నటించి.. ఓవర్‌నైట్ ఫేమస్ అయ్యాడు.. ఎవరంటే.?

Tollywood: సూర్య 'వీడొక్కడే', విజయ్ సేతుపతి 'తిలక్' సినిమాల్లో విలన్‌గా నటించిన ఆకాశ్‌దీప్ సైగల్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఆయన ముఖంలో వచ్చిన మార్పుల కారణంగా గతంలో కంటే చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. 9 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఆయన ఈ ఏడాది రీ ఎంట్రీ ఇచ్చారు.

'నాగిన్ 7', 'క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ 2' వంటి సీరియళ్లలో నటించారు. 'నాగిన్ 7'లో ఎరుల్ అనే పాత్ర పోషించారు. 'క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ 2'లో అన్ష్ కొడుకు రేయాన్ష్ (రియో) విరానీగా కనిపిస్తున్నారు. ఈ తొమ్మిదేళ్లు తాను ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నానని ఆకాశ్ చెప్పారు.

51 ఏళ్ల ఆకాశ్‌దీప్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ' తొలి సీజన్‌లో అన్ష్ గుజ్రాల్ పాత్రతో పాపులర్ అయ్యారు. తర్వాత ఏకలవ్య విరానీగా కూడా కనిపించారు. అప్పట్లో టీవీలో అతిపెద్ద విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. హిందీ బిగ్ బాస్ 5లో ఫైనలిస్ట్‌గా నిలిచారు.

'వీడొక్కడే' ఒరిజినల్ తమిళ చిత్రం 'అయాన్' 2009లో విడుదలైంది. కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, తమన్నా జంటగా నటించారు. ఆ సినిమాలో ఆకాశ్‌దీప్ సైగల్ ప్రతినాయకుడి పాత్ర చేశారు. 'క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ 2'లో తన పాత్రపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. తెర మీద తన తండ్రి పాత్ర కంటే ఆయన పెద్దవాడిలా కనిపిస్తున్నారని కొందరు విమర్శించారు. అయితే ఆ విమర్శలను ఆయన పట్టించుకోలేదు. వాటిని బయటి శబ్దంగా తీసుకున్నానని చెప్పారు.

తొలి సీజన్‌లో స్మృతి ఇరానీ పాత్ర తులసికి కొడుకుగా నటించిన ఆకాశ్‌దీప్, ఇప్పుడు ఆమె మనవడి పాత్రలో కనిపిస్తున్నారు. ఇది నటుడిగా తన ప్రస్థానంలో అద్భుతమైన మార్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.



Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.