అభిమానులకు షాకింగ్ నిజం చెప్పిన అఖిల్ అక్కినేని..
నా ఎడమ చేతికి తీవ్రమైన గాయం కావడంతో రెండు ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకోవడానికి నాకు దాదాపు 16 నెలల సమయం పట్టింది
అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం 'లెనిన్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అఖిల్, సుదీర్ఘ కాలం పాటు వెండితెరకు దూరంగా ఉండటంపై వస్తున్న విమర్శలకు తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన బయటపెట్టిన ఒక షాకింగ్ విషయం ఇప్పుడు అక్కినేని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ప్రమాదకర గాయం వెనుక అసలు కథ
అఖిల్ మాట్లాడుతూ, "నిజమే, నేను చాలా కాలం గ్యాప్ తీసుకున్నాను. ఇందులో కొంత నా తప్పిదం ఉంది, కానీ మరికొంత నా చేతుల్లో లేనిది. నా ఎడమ చేతికి తీవ్రమైన గాయం కావడంతో రెండు ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకోవడానికి నాకు దాదాపు 16 నెలల సమయం పట్టింది" అని వెల్లడించారు. 'ఏజెంట్' సినిమా విడుదలైన నాలుగు నెలలకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
అసలు ఏం జరిగింది?
"ఒక రోజు బాత్‌రూమ్‌లో జారిపడటంతో గాజు ముక్క నా చేతిలో దిగింది. అది నేరుగా నా నరాలను కట్ చేసింది. అది చాలా దురదృష్టకరమైన ప్రమాదం, ఆ సంఘటన నన్ను పూర్తిగా కుదిపేసింది" అని అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు కనీసం బరువులు కూడా ఎత్తలేని స్థితిలో ఉన్నానని, మళ్లీ జిమ్‌కు వెళ్లి ఫిజికల్ యాక్టివిటీ మొదలుపెట్టడానికి 16 నెలలు పట్టిందని ఆయన వివరించారు.
అభిమానుల ఆవేదన
అఖిల్ సినిమాల మధ్య ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోందని చాలా మంది విమర్శలు గుప్పించారు. అయితే, ఆయన పడ్డ ఈ అనారోగ్య ఇబ్బంది గురించి తెలియని అభిమానులు ఇప్పుడు ఆయన వెల్లడించిన నిజాలను విని షాక్ అవుతున్నారు. కష్టకాలంలో కూడా అఖిల్ ధైర్యంగా పోరాడి మళ్ళీ 'లెనిన్'తో సిద్ధమవ్వడం పట్ల అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం విడుదల కానున్న ఈ సినిమాతో అఖిల్ మళ్ళీ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు.




