Lenin Movie: అయ్యాగారు రూ.100 కోట్లు కొట్టేశారు..!
Lenin Movie: అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'లెనిన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.
Lenin Movie: అయ్యాగారు రూ.100 కోట్లు కొట్టేశారు..!
Akhil Akkineni: యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే మైలురాయిగా 'లెనిన్' చిత్రం నిలిచింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ నటన, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే తన అందం, అభినయంతో కథానాయికగా మెప్పించగా, ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు.
సినిమా విడుదలైన తొలి రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టించినా, కొద్ది రోజుల తర్వాత వసూళ్లు కొద్దిగా మందగించడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం కష్టమేనని విశ్లేషించాయి.అయితే, ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ప్రేక్షకులు సినిమాకు మళ్లీ బ్రహ్మరథం పట్టారు. మౌత్ టాక్ విపరీతంగా పనిచేయడంతో వీకెండ్స్‌లో కలెక్షన్లు పుంజుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రకారం, 'లెనిన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అధికారికంగా దాటింది.
అంచనాలు తలకిందులు... బాక్సాఫీస్ వద్ద అఖిల్ సరికొత్త సునామీ 'లెనిన్' సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరి బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.ప్రస్తుతం ఈ అఫీషియల్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అఖిల్ కెరీర్‌లో ఈ స్థాయి విజయం సాధించడం ఆయన అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది.




