Allu Aravind: నేటి లవ్ అంటే ఓయో రూమ్స్.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Allu Aravind: గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నేటి తరం ప్రేమలపై చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Srinivas Rao
Published on: 11 Jun 2026 6:58 PM IST
Allu Aravind
X

Allu Aravind: నేటి లవ్ అంటే ఓయో రూమ్స్.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Allu Aravind: టాలీవుడ్ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నేటి తరం ప్రేమలపై చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘దీవానా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటి కాలపు యువత ప్రేమించుకునే పద్ధతిని వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో , నెటిజన్లలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి.

థియేటర్ కార్నర్ సీట్ల నుండి ఓయో రూమ్స్ దాకా..

హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఏఏ సినిమాస్‌ (AAA Cinemas)లో జరిగిన ‘దీవానా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుత జనరేషన్ ప్రేమల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. "ఈ రోజుల్లో లవ్ అంటే ఎలా ఉందంటే.. జనాలు ఎవరూ లేని థియేటర్లకు వెళ్లడం, అక్కడ కార్నర్ సీట్లలో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేయడం. ఆ తర్వాత ఒక రెండు సార్లు షాపింగ్ మాల్స్ చుట్టూ తిరగడం.. చివరికి నేరుగా వెళ్లి ఓయో రూమ్‌లోనే ఎండ్ అవ్వడం" అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఈవెంట్‌లో ఉన్నవారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాయి. ఆయన చేసిన ఈ ప్రాక్టికల్ అండ్ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కౌంటర్

అల్లు అరవింద్ ఓయో రూమ్స్ గురించి మాట్లాడుతుండగా.. అక్కడే స్టేజ్ పై ఉన్న యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మధ్యలో కల్పించుకుని చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. "అంటే ఏంటి సార్.. నాకేమీ తెల్వదు" అంటూ అమాయకంగా ముఖం పెట్టి నవ్వించడంతో ఈవెంట్‌లో నవ్వుల పూలు పూశాయి.

ఇదే వేదికపై యాంకర్ అల్లు అరవింద్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "సార్.. మీరు మీ జీవితంలో ఎవరితోనైనా ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను కలిసి చూశారా?" అని అడగగా.. అరవింద్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. "ఇప్పుడు ఆ పేరు చెబితే అస్సలు బాగోదు.. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు పెళ్లయిపోయి, మనవలు, మనవరాలు కూడా ఉన్నారు" అంటూ చాలా సరదాగా ఆ విషయాన్ని దాటవేశారు.

జూన్ 19న థియేటర్లలోకి ‘దీవానా’

కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ‘దీవానా’ సినిమా వన్‌సైడ్ లవర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ప్యూర్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్ అల్లు అరవింద్ చేతుల మీదుగానే గ్రాండ్ గా విడుదలైంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో అల్లు అరవింద్ స్వయంగా వచ్చి చిత్ర యూనిట్‌ను బ్లెస్ చేశారు. అన్ని రకాల కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ సినిమా ప్రమోషన్లకు విపరీతమైన మైలేజ్ తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story