Allu Arjun : ఫోర్బ్స్ కవర్‌పై బన్నీ.. అల్లు అర్జున్ ఖాతాలో మరో బిగ్ రికార్డ్.!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ ఇప్పుడు సౌత్ ఇండియా సరిహద్దులు దాటి గ్లోబల్ రేంజ్‌కి రీచ్ అయింది. నేషనల్ వైడ్ మైండ్ బ్లోయింగ్ క్రేజ్ సొంతం

G Krishna
Published on: 27 Aug 2026 2:14 PM IST
allu-arjun
X

allu-arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ ఇప్పుడు సౌత్ ఇండియా సరిహద్దులు దాటి గ్లోబల్ రేంజ్‌కి రీచ్ అయింది. నేషనల్ వైడ్ మైండ్ బ్లోయింగ్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ఆల్ రౌండర్ సూపర్ స్టార్, పాపులర్ బిజినెస్ మ్యాగజైన్ 'Forbes India' రిలీజ్ చేసిన ‘Showstoppers 2026: 100 Biggest Celebrities’ స్పెషల్ ఎడిషన్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసి సరికొత్త మైలురాయిని క్రియేట్ చేశారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫోర్బ్స్ ఇండియా కవర్ పిక్‌పై ఈ స్థాయిలో ప్లేస్ దక్కించుకోవడం బన్నీ నేషనల్ వైడ్ రేంజ్‌కి, ఆయనకున్న హ్యూజ్ బాక్సాఫీస్ ప్రాధాన్యతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

బాక్సాఫీస్ రికార్డ్స్ నుంచి 'బ్రాండ్ AA' దాకా

‘పుష్ప: ది రైజ్’ తెచ్చిన అసాధారణ క్రేజ్, ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ క్రియేట్ చేసిన రికార్డ్ లెవెల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. లాంగ్వేజెస్, రీజియన్స్‌తో సంబంధం లేకుండా ఇండియా వ్యాప్తంగా బిల్డ్ అయిన ఈ మాస్ ఫాలోయింగ్ ఆయనను రియల్ పాన్-ఇండియా ఐకాన్‌గా నిలబెట్టింది. కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా, బయట మార్కెట్‌లో బన్నీకి ఉన్న విపరీతమైన క్రేజ్ చూసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ప్రచారాల కోసం అల్లు అర్జున్ వైపు చూస్తున్నాయి.

స్టార్‌డమ్ లెక్కింపును చేంజ్ చేసిన ఐకాన్ స్టార్

ఒకప్పుడు కేవలం సినిమా కలెక్షన్లను బట్టి మాత్రమే ఒక సెలబ్రిటీ పవర్ , ఇమేజ్‌ని కాలిక్యులేట్ చేసేవారు. కానీ ఇప్పుడు కల్చరల్ ఇంపాక్ట్, డిజిటల్ రిచ్, బ్రాండ్ వ్యాల్యూ, ఆడియన్స్ లాయల్టీ కూడా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ అన్ని కేటగిరీల్లో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ అని ఫోర్బ్స్ ఇండియా స్పెషల్ ఆర్టికల్‌లో హైలైట్ చేసింది. ఆయన డిఫరెంట్ స్టైలింగ్, డ్యాన్స్ మూవ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రతీదీ యూత్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

కథే మెయిన్ హీరో.. ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాటలు

ఈ స్పెషల్ ఎడిషన్ కవర్ స్టోరీ సందర్భంగా ఫోర్బ్స్‌తో మాట్లాడిన అల్లు అర్జున్.. ఇండస్ట్రీలో సినిమా సక్సెస్‌కి కథే అసలైన హీరో అని స్పష్టం చేశారు. బాలీవుడ్ లేదా సౌత్ సినిమాలు అని తేడా లేకుండా, ప్రేక్షకులు ఏ భాషలోనైనా మంచి కంటెంట్‌ను మాత్రమే ఆదరిస్తారని తెలిపారు. నటీనటుల స్టార్‌డమ్ కంటే సరైన కాన్సెప్ట్, కొత్త తరహా కథలతో రావడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు సినిమా రేంజ్‌ని పెంచిన ఐకాన్ మేనియా

టాలీవుడ్‌లో యూత్ స్టార్‌గా జర్నీ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్, ఈ రోజు నేషనల్ సెలబ్రిటీ బ్రాండ్‌గా ఎదగడం వెనుక ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్, డెడికేషన్ కారణమని చెప్పవచ్చు. కేవలం సినిమాల పరిధిని దాటి ‘బ్రాండ్ AA’ ఒక బిగ్ కల్చరల్ ఫినామినన్‌గా మారుతోందనడానికి ఈ ఫోర్బ్స్ మేగజైన్ కవర్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఈ వినూత్న రికార్డ్‌ను చూసి మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story