Allu Arjun: హైదరాబాద్‌కు అల్లు అర్జున్ గుడ్ బై..ముంబైకి షిఫ్ట్
Raaka movie: తెలుగు తెరపై 'గంగోత్రి'గా అడుగుపెట్టి, తన డ్యాన్స్‌తో, నటనతో అంచలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హోదాను అందుకున్న నటుడు అల్లు అర్జున్.
Allu Arjun
Raaka movie: తెలుగు తెరపై 'గంగోత్రి'గా అడుగుపెట్టి, తన డ్యాన్స్‌తో, నటనతో అంచలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హోదాను అందుకున్న నటుడు అల్లు అర్జున్. 'పుష్ప' సినిమాతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, ప్రస్తుతం తన తదుపరి చిత్రాల ప్లానింగ్‌లో వేగం పెంచారు. అయితే, తాజాగా ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
ముంబై మకాంకు కారణం ఏంటి?
ప్రస్తుతం అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో మెజారిటీ భాగం ముంబై పరిసరాల్లోనూ, విదేశాల్లోనూ ప్లాన్ చేశారు. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ నిమిత్తం బన్నీ ముంబైలోనే ఉంటూ, అక్కడి స్టార్ హోటళ్లలో బస చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల ప్రయాణ బడలిక పెరగడమే కాకుండా, సమయం కూడా వృథా అవుతోందని ఆయన భావిస్తున్నారట.
హోటల్ వద్దు.. లగ్జరీ ఫ్లాట్ ముద్దు
షూటింగ్ బిజీ వల్ల కుటుంబానికి దూరంగా ఉండటం ఇష్టం లేక, ముంబైలోనే ఒక లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవాలని బన్నీ డిసైడ్ అయినట్లు టాక్. దీనివల్ల షూటింగ్ విరామ సమయంలో భార్యాపిల్లలతో కలిసి గడపడానికి వీలుంటుందని ఆయన ఆలోచన. కేవలం అద్దె ఫ్లాట్ మాత్రమే కాదు, భవిష్యత్తులో బాలీవుడ్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ శాశ్వతంగా ఒక సొంత ఇల్లు కొనే ఆలోచనలో కూడా బన్నీ ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
స్పష్టత ఎప్పుడు?
అల్లు అర్జున్ నిజంగానే ముంబైకి మకాం మారుస్తున్నారా? లేక ఇది కేవలం 'రాకా' సినిమా షూటింగ్ ముగిసే వరకు మాత్రమేనా? అనే విషయంపై ఈ నెల ఆఖరులో అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా, టాలీవుడ్ ఐకాన్ స్టార్ బాలీవుడ్ కోటలో పాగా వేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.




