Allu Arjun: అల్లు అర్జున్ 'రాకా'లో విల్ స్మిత్? అదే నిజమైతే ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!
Allu Arjun: ఆస్కార్ విజేత విల్ స్మిత్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న 'రాకా' సినిమాలో విలన్ రోల్ కోసం విల్ స్మిత్‌ను అనుకుంటున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ 'రాకా'లో విల్ స్మిత్? అదే నిజమైతే ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!
Allu Arjun: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా అసాధారణ క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా సినిమా 'రాకా' గురించి సినీ వర్గాలలో ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ఒక కీలకమైన విలన్ పాత్ర కోసం హాలీవుడ్ స్టార్, ఆస్కార్ అవార్డు విజేత విల్ స్మిత్‌ను సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో విలన్ రోల్ కోసం విల్ స్మిత్‌ను నటింపజేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఆయనతో ప్రత్యక్షంగా చర్చలు జరిపేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విల్ స్మిత్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద గ్లోబల్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ స్టార్ నటుడు టాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారనే వార్త బయటికి రావడంతో అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మాస్ అప్పీల్‌కు అట్లీ టేకింగ్ తోడవడంతో పాటు విల్ స్మిత్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అటు ఈ సినిమాలో దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.




