Allu Arjun: మెగాస్టార్ మార్కెట్‌పై అల్లు అర్జున్ సెటైర్...?

Allu Arjun: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.

Gagan kumar
Published on: 24 Oct 2026 10:23 AM IST
Allu Arjun
X

Allu Arjun: మెగాస్టార్ మార్కెట్‌పై అల్లు అర్జున్ సెటైర్...?

Mega Vs Allu Fan War: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలన విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తోటి నటుడిని అభినందించే ఉద్దేశంతో బన్నీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా వర్గాల్లో, ముఖ్యంగా అభిమానుల మధ్య మరోసారి పెద్ద దుమారానికే దారితీశాయి.

రజినీకాంత్ ‘జైలర్ 2’ సినిమా రూ. 500 కోట్ల మార్కును దాటి దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకాంత్‌కే సాధ్యం అంటూ తలైవా స్టార్‌డమ్‌ను ఆకాశానికెత్తేశారు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో మరో హీరో విజయాన్ని అభినందించడం పరిపాటి. పైగా బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా ‘జైలర్ 2’ నిర్మాణ సంస్థ అయిన ‘సన్ పిక్చర్స్’ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం కోలీవుడ్ , టాలీవుడ్ సీనియర్ హీరోల బాక్సాఫీస్ స్టామినా, ముఖ్యంగా చిరంజీవి – రజినీకాంత్ కలెక్షన్ల సామర్థ్యంపై నెట్టింట తరచూ చర్చలు జరుగుతున్న సమయం ఇది. సరిగ్గా ఇదే తరుణంలో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

సీనియర్ హీరోల్లో కేవలం రజినీకాంత్ మాత్రమే ఈ స్థాయి వసూళ్లు సాధించగలరని అనడం ద్వారా, బన్నీ పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి మార్కెట్‌ను తక్కువ చేసి మాట్లాడారంటూ మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత చర్చనీయాంశమైంది.

మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు ఈ వాదనను ఖోండిస్తున్నారు. ఒక లెజెండరీ నటుడిని, ఆయన సక్సెస్‌ను సహజంగా ప్రశంసిస్తే అందులో లేనిపోని అర్థాలు వెతకడం సరికాదు అని గట్టిగా బదులిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బన్నీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తన ఉన్నతమైన అభిమానాన్ని చాటుకున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

ప్రస్తుతం ‘ఎక్స్’ వేదికగా ఇరువర్గాల అభిమానులు పరస్పర పోస్టులు, రీ-ట్వీట్లతో వార్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే ‘మెగా vs అల్లు’ ఫ్యాన్ వార్ ఈ తాజా పరిణామాంతో మరోసారి తారాస్థాయికి చేరింది. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన ప్రశంసలు కూడా కొన్నిసార్లు ఇలా వివాదాలకు దారితీయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.