Amrish Puri: విలన్‌గా భయపెట్టిన అమ్రీష్‌పురి సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో 99శాతం మందికి తెలియదు

బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లోనూ భయపెట్టిన విలన్‌ ఎవరూ అంటే అమ్రీష్‌పురి పేరు చెబుతాం. విలన్‌గా భయపెట్టిన ఆయన సినీ రంగంలోకి రాకముందు ఏం చేశావారో చాలా మందికి తెలియదు. ఆయన గురించిన వివరాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 29 Jun 2026 10:21 AM IST
Amrish Puri: విలన్‌గా భయపెట్టిన అమ్రీష్‌పురి సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో 99శాతం మందికి తెలియదు
X

Amrish Puri: భారతీయ సినిమా చరిత్రలో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడు అమ్రీష్ పురి. "మొగాంబో ఖుష్ హువా" అంటూ ఆయన గంభీరమైన కంఠంతో పలికిన ఒక్క డైలాగ్ చాలు, ఇప్పటికీ ప్రేక్షకుల్లో వణుకు పుట్టించడానికి. అయితే, వెండితెరపై అంతలా భయపెట్టిన ఈ లెజెండరీ నటుడు, సినిమాల్లోకి రాకముందు ఒక సాధారణ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్‌గా పనిచేశారనే నిజం చాలామందికి తెలియదు. ఒక సాధారణ ఉద్యోగి అంతర్జాతీయ స్థాయి నటుడిగా ఎలా ఎదిగారో, ఆయన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం

అమ్రీష్ పురికి సినీ పరిశ్రమ కొత్తేమీ కాదు. ఆయన కుటుంబంలో అప్పటికే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్ అయిన కేఎల్ సైగల్ ఈయనకు స్వయానా కజిన్. అలాగే అప్పట్లోనే బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మదన్ పురి, చమన్ పురిలు అమ్రీష్ పురికి అన్నయ్యలు. వీరిద్దరూ బాలీవుడ్‌ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.

ఇన్సూరెన్స్ క్లర్క్ టు స్టార్ యాక్టర్

అన్నలు సినిమాల్లో ఉన్నా, అమ్రీష్ పురి మాత్రం తొలినాళ్లలో భీమా సంస్థలో ఉద్యోగం చేసుకునేవారు. కానీ ఆయనకు నాటకాలంటే ప్రాణం. థియేటర్ గురువు సత్యదేవ్ దూబే పర్యవేక్షణలో 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'లో నటనలోని మెళకువలను నేర్చుకున్నారు. అయితే, ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయి నటుడిగా మారడానికి ఆయన భార్య ఊర్మిళ దివేకర్ ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణం. భార్య మాటతోనే ఆయన ఉద్యోగాన్ని వదిలి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

సినీ ప్రస్థానం ... అవార్డుల పంట

దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ప్రేమ్ పూజారి' సినిమాతో అమ్రీష్ పురి వెండితెరకు పరిచయమయ్యారు. ఇక 1980లో వచ్చిన 'హమ్ పాంచ్' సినిమాలో విలన్ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. తన సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 142 సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. బాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాకుండా, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. కేవలం డబ్బు కోసమే కమర్షియల్ సినిమాలు చేసినా, సమాజానికి ఉపయోగపడే సినిమాల్లో నటించడానికే ఆయన ఎక్కువగా మొగ్గు చూపేవారు. ఇక ఆయన నటన ముందు అవార్డులు రివార్డులు వెలవెలబోయాయి. నాలుగు సార్లు ఆయన జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. మూడు ఫిలింఫేర్‌ అవార్డులు ఆయన్ను వరించాయి. సినీ రంగానికి చేసిన సేవలను పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును అందజేసింది. నాటక్‌ సంగీత్‌ అవార్డుతో పాటు అమ్రీష్‌ పురి సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అయితే, సినిమాల్లో క్రూరమైన విలన్‌గా కనిపించినా, నిజ జీవితంలో అమ్రీష్ పురి క్రమశిక్షణ గల గొప్ప వ్యక్తి. విలన్ పాత్రలకు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ఆయన స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story