EPIC: పెళ్లికి ముందే ఫిజికల్‌గా ఒక్కటైతే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా!

EPIC: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' మూవీ సెప్టెంబర్ 11న రిలీజ్. సినిమా బోల్డ్ కాన్సెప్ట్‌పై నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్.

Gagan kumar
Published on: 9 Sept 2026 11:41 AM IST
EPIC
X

EPIC: పెళ్లికి ముందే ఫిజికల్‌గా ఒక్కటైతే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా!

EPIC First Semester: 'బేబి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో దూకుడు పెంచింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమా కాన్సెప్ట్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణ లవ్ స్టోరీలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా ప్రేమకథలంటే తల్లిదండ్రుల అడ్డంకులు, లేదా ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే ఉంటాయి. కానీ, జీవితంలో పూర్తిగా సెటిల్ కాకముందే ఓ అమ్మాయిని ప్రేమిస్తే, వారిద్దరూ ఎమోషనల్‌గా ఒక్కటయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలోనూ చర్చించలేదు" అని నాగవంశీ తెలిపారు.

శారీరక సంబంధం ఏర్పడిన మరుసటి రోజు అబ్బాయి, అమ్మాయి మధ్య ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, వారి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా నిజాయితీగా చూపించబోతున్నారు. కమర్షియల్ సినిమాల్లో అరుదుగా ప్రస్తావించే రుతుస్రావం వంటి అంశాల గురించి కూడా ఈ చిత్రంలో చర్చించినట్లు నిర్మాత తెలిపారు.

'ఎపిక్' అనేది ఒక విలక్షణమైన ప్రయోగమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'బేబి' జోడీ నుంచి వస్తున్న ఈ డిఫరెంట్ ఎమోషనల్ అండ్ బోల్డ్ కంటెంట్ యూత్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 11 వరకు ఆగాల్సిందే.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story