Anasuya: మరో వివాదంలో అనసూయ..ఈసారి దేవుడిపై!
Anasuya: సనాతన ధర్మం వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్.
Anasuya: మరో వివాదంలో అనసూయ..ఈసారి దేవుడిపై!
Anasuya controversy: ప్రముఖ నటి, బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సనాతన ధర్మంపై ఆమె చేశారంటున్న కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. అనసూయ హిందూ ధర్మాన్ని అవమానించారంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే, తనపై జరుగుతున్న ఈ ప్రచారంపై స్పందించిన అనసూయ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తన మాటలను కొందరు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తూ నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ మతాన్ని లేదా సనాతన ధర్మాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నిత్యం అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు, వ్యక్తిగత దాడులకు పాల్పడే కొందరు నెటిజన్లను ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఏ మతానికి లేదా వర్గానికి వ్యతిరేకం కావు. తాను సనాతన ధర్మాన్ని మనస్ఫూర్తిగా పాటించే హిందువునని, నిజాన్ని చెప్పడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, ఎదుటివారిని మనుషులుగా గౌరవించడమే ధర్మం తనకు నేర్పిందని తెలిపారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో సనాతన ధర్మాన్ని అనుసరిస్తానని చెప్పిన అనసూయ, తనకు ఆంజనేయస్వామి ధైర్యమే ప్రధాన స్ఫూర్తి అని పేర్కొన్నారు. హనుమంతుడు ఇచ్చే ధైర్యం, బలమే తనను అన్యాయం జరిగిన చోట మాట్లాడేలా చేస్తాయని రాసుకొచ్చారు.
పూర్తి విషయాన్ని తెలుసుకోకుండా, కొన్ని సెకన్ల ఎడిటెడ్ వీడియో క్లిప్పులు, అసంపూర్ణమైన వార్తలను చూసి ఒక ముగింపునకు రావద్దని నెటిజన్లను కోరారు. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా, నిజం వైపు నిలబడటమే తన నైజమని అనసూయ మరోసారి నిరూపించారు. ఆమె ఇచ్చిన ఈ వివరణతోనైనా వివాదాలకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి.




