Anasuya Bharadwaj: భర్త చనిపోతే బొట్టు తీసేయాలా ..? భర్త ఉన్నా నీకు ఎందుకు లేదంటూ ఘాటుగా!

Anasuya Bharadwaj: నిత్యం ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో నిలిచే నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు.

Gagan kumar
Published on: 24 Aug 2026 10:32 AM IST
Anasuya Bharadwaj
X

Anasuya Bharadwaj: భర్త చనిపోతే బొట్టు తీసేయాలా ..? భర్త ఉన్నా నీకు ఎందుకు లేదంటూ ఘాటుగా!

Anasuya Bharadwaj: నిత్యం ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో నిలిచే నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. భారతీయ సంప్రదాయాలు, మహిళల అలంకరణలపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అనసూయ తన ఇంట్లో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. మూడేళ్ల క్రితం తండ్రి మరణించిన తర్వాత, తన తల్లి కాటుక, బొట్టు, గాజులు, తలలో పూలు వంటి అలంకరణలన్నింటికీ దూరం కావడం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు.

ఆడపిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేసే ఈ అలంకారాలను పెళ్లితో ముడిపెట్టి, భర్త చనిపోగానే తీసేయడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ తీసేయాల్సి వస్తే జన్మనిచ్చిన అమ్మ లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు తీసేయాలి కానీ, భర్త మరణంతో వీటికి ఎందుకు లింక్ పెట్టారు? అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. అనసూయ లేవనెత్తిన పాయింట్‌పై కొంతమంది మద్దతు తెలిపినప్పటికీ, మెజారిటీ నెటిజన్లు ఆమెపై ఘాటుగా విరుచుకుపడుతున్నారు.

భర్త చనిపోతే బొట్టు తీసేయకూడదు అని క్లాసులు చెబుతున్న నువ్వు, స్వయంగా అదే వీడియోలో నుదుట బొట్టు లేకుండా ఎందుకు కనిపించావు? భర్త ఉండి కూడా నువ్వు బొట్టు పెట్టుకోనప్పుడు సమాజానికి నీతులు చెప్పడం ఏంటి? అని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవలే జై శ్రీరామ్ నినాదంపై అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమై, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ వివాదంపై సీనియర్ నటి హేమ స్పందిస్తూ.. అద్దాల మేడలో ఉండే సినీ ప్రముఖులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. జై శ్రీరామ్ అనేది పవిత్రమైన దివ్య మంత్రం. ధర్మాన్ని నిందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఘాటుగా హెచ్చరించారు. ఆ కాంట్రవర్సీ ఇంకా సద్దుమణగక ముందే, కట్టు-బొట్టుపై అనసూయ చేసిన వ్యాఖ్యలు ఆమెను మళ్లీ వివాదాల కేంద్రబిందువుగా మార్చాయి.


Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story