Vishnu Priya: అదృష్టం తెచ్చిపెట్టిన కేసు..నెలకు రూ.18 లక్షల సంపాదన
Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియపై నమోదైన పోలీసు కేసు ఆమెకు అనూహ్యంగా లాభాన్ని తెచ్చిపెట్టింది.
Vishnu Priya: అదృష్టం తెచ్చిపెట్టిన కేసు..నెలకు రూ.18 లక్షల సంపాదన
Vishnu Priya Controversy: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ ప్రచారమే సెలబ్రిటీలకు కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా యాంకర్ విష్ణుప్రియ విషయంలో ఇదే జరుగుతోంది. వివాదం ఆమెను చుట్టుముట్టినా, అది ఆమె బ్యాంక్ బ్యాలెన్స్‌ను మాత్రం భారీగా పెంచేసింది. టాలీవుడ్ బోల్డ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ, ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా ఆమె షేర్ చేస్తున్న కంటెంట్‌పై విమర్శలు రావడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. అయితే, ఈ వివాదం ఆమె కెరీర్‌ను దెబ్బతీయకపోగా, అనూహ్యంగా ఆదాయాన్ని రెట్టింపు చేసింది.
లక్షల సంపాదన
ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను విష్ణుప్రియ స్మార్ట్‌గా వాడుకుంటోంది. కేసు నమోదు కాకముందు ఆమెకు దాదాపు 1,892 మంది సబ్‌స్క్రైబర్లు ఉండేవారు. ఒక్కో సబ్‌స్క్రైబర్ నుండి నెలకు రూ. 399 వసూలు చేస్తూ, నెలకు సుమారు రూ. 7 లక్షల వరకు సంపాదించేది. ఆమెపై ఫిర్యాదు అందిన తర్వాత అసలు విషయం మొదలైంది. అసభ్యకర కంటెంట్ ఉందంటూ జరిగిన రచ్చతో నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు ఆ సబ్‌స్క్రిప్షన్ గ్రూప్‌లో ఏముందో చూద్దాం అని చాలామంది ఎగబడ్డారు.
ఫిర్యాదు అందాక సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 4,832 కి చేరింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆమె నెలకు సుమారు రూ. 18 లక్షలకు పైగా సంపాదిస్తోంది. అంటే కేసు పెట్టిన తర్వాత విష్ణుప్రియ ఆదాయం దాదాపు 150 శాతం పెరగడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కేసు పెట్టిన వాళ్లు విష్ణుప్రియకు అన్యాయం చేద్దాం అనుకుంటే, అది కాస్తా ఆమెకు ఉచిత ప్రచారంగా మారిపోయింది.
నెగిటివిటీని కూడా ఇంతలా క్యాష్ చేసుకోవచ్చా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో, విమర్శలు ఎన్ని వచ్చినా ఈ స్థాయిలో సంపాదన అంటే మామూలు విషయం కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పోలీసు కేసు విష్ణుప్రియ ఇమేజ్‌ను ఏం చేస్తుందో పక్కన పెడితే, ఆదాయాన్ని మాత్రం ఆకాశానికి చేర్చిందనేది వాస్తవం.




