Anil Ravipudi: అనిల్ రావిపూడి ‘వివాహ భోజనంబు’ కామెడీ రీక్రియేషన్.. ప్రోమో వైరల్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మేకింగ్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలయికలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సంక్రాంతి మూవీ ‘NKRAR2’ మరోసారి వార్తల్లో నిలిచింది.

Srinivas Rao
Published on: 12 Jun 2026 8:17 PM IST
Anil Ravipudi
X

Anil Ravipudi: అనిల్ రావిపూడి ‘వివాహ భోజనంబు’ కామెడీ రీక్రియేషన్.. ప్రోమో వైరల్!

Anil Ravipudi: వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి మేకింగ్‌లో విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సంక్రాంతి మూవీ ‘NKRAR2’ (వర్కింగ్ టైటిల్) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు.

‘వివాహ భోజనంబు’కామెడీ రీక్రియేషన్..

ఈ చిత్రానికి టాలెంటెడ్ అండ్ క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నారు. ఆయనను టీమ్‌లోకి ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘వివాహ భోజనంబు’లోని లెజెండరీ కమెడియన్స్ దివంగత సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే ఒక ఐకానిక్ కామెడీ సీన్‌ను ఈ ప్రోమో కోసం అనిల్ రావిపూడి స్టైల్లో హిలేరియస్‌గా రీక్రియేట్ చేశారు.

ఈ వినూత్నమైన కాన్సెప్ట్ ద్వారా ఈ సినిమాలో మ్యూజికల్ ఎమోషన్స్ , హిలేరియస్ నవ్వుల విందు ఏ రేంజ్‌లో ఉండబోతుందో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ క్రేజీ ఐడియాను మనస్ఫూర్తిగా అంగీకరించి, షూటింగ్‌లో పాల్గొన్నందుకు చిత్ర బృందం జీవీ ప్రకాష్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

‘కుమ్మేద్దాం’ అంటూ జీవీ ప్రకాష్ జోష్!

చిత్ర యూనిట్ ఇచ్చిన గ్రాండ్ వెల్‌కమ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కూడా ఎంతో ఎమోషనల్ అండ్ హ్యాపీగా స్పందించారు. ఈ ఫన్నీ కాన్సెప్ట్ వీడియో షూట్ చేయడం తనకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిందని, ఈ సినిమా కోసం అద్భుతమైన , ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్ అందించడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. తన ట్వీట్ చివర్లో పక్కా మాస్ స్టైల్లో “కుమ్మేద్దాం” అంటూ ఆయన రాసుకొచ్చిన లైన్ ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపింది.

జూన్ 18న గ్రాండ్ లాంచ్.. క్రేజీ కాస్టింగ్!

ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2026 జూన్ 18న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఆ వెంటనే జూన్ 22, 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఒక హీరోయిన్‌గా ఇప్పటికే లాక్ అవ్వగా, మిగతా ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

భారీ నిర్మాణ సంస్థల కలయిక

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సురేష్ ప్రొడక్షన్స్ , జీ స్టూడియోస్ భాగస్వాములుగా వ్యవహరిస్తుండటంతో సినిమాపై అంచనాలు స్కై హై రేంజ్‌కు చేరుకున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కి వెంకీ-కళ్యాణ్ రామ్ ల తోడు, జీవీ ప్రకాష్ మ్యూజిక్ కూడా యాడ్ అవ్వడంతో వచ్చే సంక్రాంతికి థియేటర్లలో వినోదాల జాతర ఖాయంగా కనిపిస్తోంది.


Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story