Tollywood: రూమర్ లవర్స్ టూ రియల్ జోడీ.. నెట్టింట తెగ వైరల్.!

Tollywood: అనిరుధ్, కావ్య మారన్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రూమర్స్‌కు త్వరలోనే తెరపడనుంది.

Ravi
By Ravi
Published on: 17 Oct 2026 12:32 PM IST
Tollywood
X

Tollywood: రూమర్ లవర్స్ టూ రియల్ జోడీ.. నెట్టింట తెగ వైరల్.!

Tollywood: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట గత కొంతకాలంగా విపరీతంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారానికి సంబంధించిన తాజా పరిణామాలు ప్రస్తుతం సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తాజా సమాచారం ప్రకారం అనిరుధ్, కావ్య మారన్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రూమర్స్‌కు త్వరలోనే పూర్తిస్థాయిలో తెరపడనుందని తెలుస్తోంది. పెళ్లా ఇవన్నీ రూమర్సే ఫ్రెండ్స్ అంటూ గతంలో స్వయంగా అనిరుధ్ ఖండించినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆ మాటలను నమ్మలేదు.

చివరికి ఈ ఇద్దరూ వచ్చే నెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నారంటూ తాజాగా వస్తున్న వార్తలు అలాగే పంపిణీ అవుతున్న ఆహ్వాన పత్రికలతో స్పష్టమైందని తెలుస్తోంది. రూమర్స్ నుంచి రియల్ జోడీగా మారుతున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అత్యంత గోప్యంగా జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పరిణామాలకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అటు అనిరుద్, ఇటు కావ్య మారన్ ఇద్దరూ కూడా ఎక్కడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.