Anirudh - Kavya Maran: కావ్య మారన్- అనిరుధ్‌ల వెడ్డింగ్.. తెలుగులో ఆ ఒక్క హీరోకే ఆహ్వానం!

Anirudh - Kavya Maran: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Gagan kumar
Published on: 28 Oct 2026 8:25 AM IST
Anirudh - Kavya Maran
X

Anirudh - Kavya Maran: కావ్య మారన్- అనిరుధ్‌ల వెడ్డింగ్.. తెలుగులో ఆ ఒక్క హీరోకే ఆహ్వానం!

Anirudh Ravichander wedding: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అందిన సమాచారం ప్రకారం... వచ్చే నెల 10, 11 తేదీల్లో గ్రీస్‌లోని అద్భుతమైన లొకేషన్‌లో ఈ రాయల్ వెడ్డింగ్ జరగనుందట. ఈ వేడుకను కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి స్నేహితులు మరియు సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

డెస్టినేషన్ వెడ్డింగ్ పూర్తయిన తర్వాత, సినీ మరియు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల కోసం నవంబర్ 21న చెన్నైలోని ప్రతిష్టాత్మక ఐటీసీ గ్రాండ్ వేదికగా భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారట. ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సహా పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం.

సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హీరో శివకార్తికేయన్, అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తదితర కోలీవుడ్ దిగ్గజాలు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మాత్రమే ఈ స్పెషల్ గెస్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం విశేషం.

ఒకవైపు పెళ్లి వార్తలు హల్‌చల్ చేస్తుండగానే, మరోవైపు వీరికి సంబంధించిందంటూ ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఐవరీ రంగు బాక్స్‌పై లేత నీలి రంగు ఎంబ్రాయిడరీతో ఈ బాక్స్‌ను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. బాక్స్‌పై ఎంబాస్ చేసిన అక్షరాలు, వింటేజ్ లుక్ ఇచ్చే ప్రత్యేకమైన సీల్ ఈ ఇన్విటేషన్ కార్డ్‌కు రాయల్ లుక్‌ను తీసుకొచ్చాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రచారం జరుగుతున్న ఈ పెళ్లి వార్తలపై ఇంకా అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.