Anna konidela: చిరంజీవిని ఉద్దేశిస్తూ అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే.
Anna konidela: ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
Anna konidela: చిరంజీవిని ఉద్దేశిస్తూ అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే.
Anna konidela: ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అకౌంట్
అన్నా కొణిదెల ఇటీవల “anna_konidela” పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించారు. ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె అకస్మాత్తుగా ఈ వేదికలోకి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో, తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, కళలపై ఉన్న తన ఆసక్తిని ఈ వేదిక ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
భారతీయ సంస్కృతిపై ఆసక్తి
రష్యాలో జన్మించిన అన్నా కొణిదెల, భారతీయ కుటుంబంలోకి కోడలిగా వచ్చిన తర్వాత రెండు సంస్కృతులను దగ్గరగా అనుభవిస్తున్నానని చెప్పారు. తన ఇన్స్టాగ్రామ్ బయోలో Russian heart, Indian soul అని రాయడం ద్వారా భారతదేశం తన ఆత్మ అనే సందేశాన్ని ఆమె చాటారు. సోషల్ మీడియాలోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఇప్పుడు సరైన సమయం అనిపించిందని కూడా తెలిపారు.
పవన్ కళ్యాణ్ స్వాగతం.. అభిమానుల్లో ఉత్సాహం
అన్నా కొణిదెల ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించగానే ఆమెకు భారీ స్పందన వచ్చింది. కొన్ని గంటల్లోనే ఫాలోవర్స్ సంఖ్య లక్ష దాటడం విశేషం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా తన భార్యకు సోషల్ మీడియాలో స్వాగతం పలికారు. “ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
మెగా బ్రదర్స్ గురించి ఎమోషనల్ పోస్ట్
ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన తర్వాత అన్నా కొణిదెల చేసిన తొలి పోస్ట్ చాలా భావోద్వేగంగా ఉంది. దాదాపు పదిహేనేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కుటుంబంలోకి వచ్చినప్పుడు తనకు ఎవరిని ఎలా సంభోదించాలో కూడా తెలియదని ఆమె పేర్కొన్నారు. అప్పుడు తన భర్త పవన్ కళ్యాణ్ ఎలా పిలుస్తారో చూసి తాను కూడా “అన్నయ్య, చిన్న అన్నయ్య” అని పిలవడం ప్రారంభించానని చెప్పారు. మొదట్లో అది కేవలం మాట మాత్రమే అయినప్పటికీ, కాలక్రమేణా అది నిజమైన అనుబంధంగా మారిపోయిందని ఆమె వెల్లడించారు. తనకు చిన్నప్పటి నుంచి సోదరులు లేరని, కానీ జీవితమే తనకు ఇద్దరు అన్నలను ఇచ్చిందని ఆమె ఆ పోస్ట్‌లో భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సందేశం సోషల్ మీడియాలో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.




