Anupama Parameswaran: నా వీడియోను తప్పుగా చూపిస్తారా..?
Anupama Parameswaran: పెళ్లి, పిల్లల వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నటుడు నరేష్ క్లారిటీ ఇచ్చారు.
Anupama Parameswaran: నా వీడియోను తప్పుగా చూపిస్తారా..?
Crazy Kalyanam: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, విలక్షణ నటుడు వికె నరేష్, దర్శకుడు తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నటుడు నరేష్ 'పెళ్లి, పిల్లలు' గురించి చేసిన వ్యాఖ్యలు, దానికి అనుపమ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. అనుపమ పెళ్లి వద్దు.. కేవలం పిల్లలే కావాలి అని అన్నట్లుగా ఓ చిన్న వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడం, నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించడంతో తాజాగా జరిగిన ‘క్రేజీ కల్యాణం’ సక్సెస్ మీట్లో అనుపమ, నరేష్ ఈ వివాదంపై స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు.
తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గట్టిగానే స్పందించారు. నెప్పుడూ పెళ్లి వద్దని చెప్పలేదు. నా వ్యాఖ్యల్లోని సగం భాగాన్ని మాత్రమే కట్ చేసి నెట్టింట తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు కావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కేవలం పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సరైన పద్ధతి కాదని మాత్రమే నేను చెప్పాను. పిల్లలను ఈ లోకంలోకి తెచ్చేటప్పుడు వారికి సంతోషకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని అందించడం చాలా ముఖ్యమని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చారు.
మరోవైపు పక్కనే ఉన్న సీనియర్ నటుడు నరేష్ కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. ప్రపంచంలో జనాభా తగ్గిపోతోందని, చాలామంది పెళ్లిళ్లకు భయపడి లివిన్ రిలేషన్షిప్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావించి ఆ మాటలన్నాను.
పెళ్లి చేసుకున్నా లేదా రిలేషన్షిప్లో ఉన్నా పిల్లలను కనాలి, లేకపోతే సృష్టి చక్రం ఆగిపోతుందనే ఉద్దేశంతోనే సరదాగా మాట్లాడాను తప్ప ఎవరినీ బాధపెట్టాలని కాదు. సక్సెస్ మీట్లో అనుపమ క్లారిటీ ఇవ్వడం, నరేష్ క్షమాపణలు చెప్పడంతో గత కొన్నిరోజులుగా 'క్రేజీ కల్యాణం' మూవీ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదానికి మొత్తానికి చెక్ పడినట్లయింది.




