ఆ హీరో అంటే పిచ్చి..ఆయన కోసం ఏదైనా చేస్తా... అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్!
Anupama Parameswaran: సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకు క్రష్ ఉందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మనసులోని మాట బయటపెట్టారు.
ఆ హీరో అంటే పిచ్చి..ఆయన కోసం ఏదైనా చేస్తా... అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్!
Anupama Parameswaran: టాలీవుడ్‌లో తన సహజ నటనతో, చలాకీ మాటలతో ప్రేక్షకులను అలరించే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిమానాన్ని దాచుకోకుండా చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌గానే కాదు, ఏకంగా మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వచ్చినా సిద్ధమేనని అనుపమ చెప్పడం విశేషం.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబును ఒక్క మాటలో వర్ణించమని యాంకర్ అడిగారు. దానికి ఏమాత్రం తడుముకోకుండా మహేష్ బాబు చాలా అందంగా, హ్యాండ్సమ్‌గా ఉంటారని, తనకు ఆయనపై క్రష్ ఉందని అనుపమ మనసులోని మాటను బయటపెట్టారు. భవిష్యత్తులో ఆయన సినిమాలో విలన్ పాత్ర చేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పారు. అయితే, ఆ పాత్ర చేస్తే ఎదురయ్యే సరదా ఇబ్బందిని కూడా ఆమె నవ్వుతూ పంచుకున్నారు.
ఒకవేళ నిజంగానే మహేష్ బాబు సినిమాలో నాకు విలన్ వేషం దొరికితే, సన్నివేశం ప్రకారం ఆయన వైపు ఎంతో కోపంగా, కసిగా చూడాలి. కానీ ఆయన అందం ముందు నేను అలా నటించగలనా అనిపిస్తోంది. కోపంగా చూడాల్సిన చోట ఆయన్ని రొమాంటిక్‌గా చూస్తూ ఉండిపోతానేమో.
అంతేకాదు ఆయన ఎదురుగా నిలబడితే నా డైలాగులు కూడా మర్చిపోతానేమో. అనుపమ చెప్పిన ఈ క్యూట్ కన్ఫెషన్ ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల మధ్య వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ చరిష్మాను మరోసారి గుర్తుచేస్తూ అభిమానులు ఈ వీడియో క్లిప్స్, కొటేషన్లను షేర్ చేస్తున్నారు.
2015లో వచ్చిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమమ్’తో వెండితెరకు పరిచయమైన అనుపమ, ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘శతమానం భవతి’లో నిత్య పాత్రతో తెలుగు ప్రేక్షకుల ఇంటి ఆడపడుచుగా మారిపోయారు.
పాత్ర నిడివి కంటే కథలో బలం, నటనకు ఉన్న ప్రాధాన్యతను చూసి సినిమాలు ఎంచుకుంటున్న ఆమె, ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సత్తా చాటుతూ, ‘పరదా’ చిత్రాన్ని తన కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాగా పేర్కొన్నారు.
నటిగానే కాకుండా టెక్నికల్ విభాగంలోనూ అనుపమ తన ప్రతిభను చాటుకున్నారు. ‘ఐ మిస్ యూ’ అనే తెలుగు షార్ట్ ఫిల్మ్‌కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి కెమెరా వెనుక ఉన్న తన కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఆమె యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘భోగి’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి అనుపమ కోరుకున్నట్లుగా భవిష్యత్తులో మహేష్ బాబు సినిమాలో విలన్‌గానో, హీరోయిన్‌గానో ఆమెను చూసే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.




