Anupama Parameswaran: ఆ హీరోను బ్లాక్ చేసిన అనుపమ పరమేశ్వరన్..ఇకపై ఎవరి పర్మిషన్ అవసరం లేదంటూ..!

Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Naresh.k
Published on: 20 July 2026 10:27 AM IST
Anupama Parameswaran
X

Anupama Parameswaran: ఆ హీరోను బ్లాక్ చేసిన అనుపమ పరమేశ్వరన్..ఇకపై ఎవరి పర్మిషన్ అవసరం లేదంటూ..!

Dhruv Vikram: మాలీవుడ్ ముద్దుగుమ్మ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. మనశ్శాంతి కోసం కొన్ని బంధాలను వదిలేశానని, ఇకపై తన జీవితానికి ఎవరి అనుమతులూ, అప్రూవల్స్ అవసరం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు, యువ హీరో ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ ప్రేమలో ఉందంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజా పోస్టులతో పాటు ఆమె అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరి బంధానికి బ్రేక్ పడిందని, ఇద్దరూ విడిపోయారనే రూమర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. గత మే నెల నుండి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న అనుపమ, శనివారం సముద్ర తీరాన ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేస్తూ గుండెల్లోని మాటను బయటపెట్టింది.

కొన్నిసార్లు మనశ్శాంతిని పొందేందుకు కొన్ని డెడ్ ఎండ్స్ వదిలేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆ ప్రశాంతత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పటి నుండి, నా స్వరాన్ని నేనే ఎంచుకుంటాను. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను. ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు.. ఎలాంటి భయాలూ లేవు.

ఇప్పుడు కేవలం నేను మాత్రమే ఉన్నాను. నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకుంటూ, నేను దాదాపు మర్చిపోయిన నాదైన జీవితంతో మళ్లీ ప్రేమలో పడుతున్నాను అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు, తన కష్టసమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇది నా కోలుకునే సమయం.. నా స్వేచ్ఛా సమయం.. ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోకుండా బ్రతికే నా కొత్త జీవితానికి స్వాగతం అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే ఆమె ఏకంగా 20 ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. అయ్యో..వరుసగా ఇన్ని ఫోటోలు పెట్టినందుకు క్షమించండి. ఒక విషయం అర్థమైంది.. మనం ఎవరి ఆమోదాల కోసమో, ఒక పాట ఎంపిక కోసమో లేదా వేరొకరు రాసే క్యాప్షన్ కోసమో వేచి చూడాల్సిన అవసరం లేనప్పుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా సరదాగా ఉంటుంది అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్యాక్ టు లైఫ్ అని ట్యాగ్ చేసింది.

అనుపమ పెట్టిన ఈ వరుస పోస్టులపై సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ.. నీకు మరింత శక్తి లభిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధ్రువ్ విక్రమ్‌ను అన్‌ఫాలో చేయడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకరి కంట్రోల్‌లో ఉంటూ, కెరీర్ అప్రూవల్స్ కోసం ఎదురుచూసి విసిగిపోయాకే అనుపమ ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఎవరి అనుమతులూ అవసరం లేదు అని స్పష్టం చేసిందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story