Arey Aapandra Movie: మే 15న థియేటర్లలోకి ‘అరేయ్ ఆపండ్రా’ నవ్వుల విందు
Arey Aapandra Movie: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజున (మే 15) "అరేయ్ ఆపండ్రా" సినిమా విడుదల కానుంది.
Arey Aapandra Movie: మే 15న థియేటర్లలోకి ‘అరేయ్ ఆపండ్రా’ నవ్వుల విందు
Arey Aapandra Movie: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా మే 15న థియేటర్లలో నవ్వులు పూయించడానికి సిద్ధమవుతోంది అరేయ్ ఆపండ్రా చిత్రం. కామెడీ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్‌పై బేబీ హరిణి సమర్పణలో, అశోక్ నిమ్మల నిర్మాణంలో తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వెంకట్ దుగ్గిరెడ్డి, అంజాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర కీలక పాత్రల్లో వినోద్ నువ్వుల, కిషోర్ దాస్ నటించారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను సహజమైన హాస్యంతో చూపిస్తూ, ఒక మంచి సందేశాన్ని అందించేలా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ, ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే మంచి కామెడీ చిత్రంగా “అరేయ్ ఆపండ్రా” నిలుస్తుందని అన్నారు. తక్కువ బడ్జెట్‌లోనే డైరెక్టర్ సినిమాను చక్కగా తెరకెక్కించారని, నటీనటులంతా అద్భుతంగా నటించారని పేర్కొన్నారు.
సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి ఈ సినిమాను భారతదేశంతో పాటు అమెరికాలో కూడా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరో సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ సినిమా ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని తెలిపారు. దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, న్యాచురల్ కామెడీతో పాటు ఒక బలమైన సందేశాన్ని ఈ చిత్రంలో చూపించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఒంగోలు గిత్త చిత్రంలో నటించిన కిషోర్ దాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం తమకు ఉపయోగపడిందని చెప్పారు.
నటుడు వినోద్ నువ్వుల ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. కిషోర్ దాస్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఒక బాధ్యత గల తండ్రి పాత్రలో నటించడం తనకు కొత్త అనుభవమని చెప్పారు.
సాంకేతిక వర్గం:
బ్యానర్: క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్
సమర్పణ: గణేష్ భారీ
నిర్మాత: అశోక్ నిమ్మల
సహ నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (USA), అంజాద్
దర్శకత్వం: తల్లాడ సాయి కృష్ణ
సంగీతం: లలిత్ కిరణ్
ఎడిటింగ్: మోహన్




