నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతావు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మండిపడ్డ అశోక్ పండిట్

Ashoke Pandit: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ స్క్రిప్ట్ వివాదం, అతనిపై పడిన బ్యాన్ ఇటీవలే వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

Srinivas Rao
Published on: 4 Jun 2026 4:29 PM IST
Ashoke Pandit
X

నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతావు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మండిపడ్డ అశోక్ పండిట్

Ashoke Pandit: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ స్క్రిప్ట్ వివాదం, అతనిపై పడిన బ్యాన్ ఇటీవలే వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదం కాస్తా ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ , నటి-రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మధ్య సరికొత్త మాటల యుద్ధానికి దారితీసింది. రణ్‌వీర్‌పై ఫెడరేషన్ నిషేధం విధించినప్పుడు కంగనా అతనికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై అశోక్ పండిట్ అత్యంత ఘాటుగా స్పందించారు.

కంగనా రనౌత్ అసలు ఏమంది?

రణ్‌వీర్ సింగ్ వివాదం నడుస్తున్న సమయంలో కంగనా రనౌత్ అతనికి పరోక్షంగా మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "సమాజంలో హోదా, క్రేజ్ పెరిగినప్పుడు శత్రువులు కూడా అదే స్థాయిలో పెరుగుతారు" (Jab haisiyat badhti hai toh dushman bhi badhte hain) అంటూ రణ్‌వీర్‌పై సానుభూతి కురిపించింది. అంతేకాకుండా, గతంలో ఇండస్ట్రీ తనపై కూడా ఇలాగే బ్యాన్ విధించిందని ఆమె గుర్తు చేసింది.

"నువ్వు నోటికొచ్చినట్టు వాగుతావు".. అశోక్ పండిట్ స్ట్రాంగ్ కౌంటర్!

రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన అనంతరం అశోక్ పండిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కంగనా వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇండస్ట్రీలో చాలా మంది అసలు విషయం తెలుసుకోకుండా మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. నిన్న కంగనా కూడా ఏదో మాట్లాడింది. అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోకుండా కేవలం హెడ్‌లైన్స్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తనను కూడా ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని కంగనా అంటోంది.. దానికి నేను ఒకటే చెప్తున్నా, 'నువ్వు నోటికొచ్చినట్టు (నాన్‌సెన్స్) మాట్లాడతావు, అందుకే నిన్ను బ్యాన్ చేశాను.' నాకు ఆ విషయాలతో సంబంధం లేదు. ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద సమస్య నడుస్తోంది. అసలు సమస్య ఏంటో కూడా తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు” , అశోక్ పండిట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము రణ్‌వీర్‌కు వ్యతిరేకం కాదు!

తాము రణ్‌వీర్ సింగ్‌కు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదని అశోక్ పండిట్ స్పష్టం చేశారు. 'డాన్ 3' సినిమా నుండి రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల నిర్మాతలకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఒక బాధ్యతాయుతమైన ప్రొఫెషనల్ ఒప్పందాన్ని గుర్తు చేయడానికే తాము 'అసహకార ఉత్తర్వులు' జారీ చేశామని ఆయన వెల్లడించారు. ఇండస్ట్రీలో జవాబుదారీతనాన్ని కాపాడటమే ఫెడరేషన్ లక్ష్యమని, ఇప్పుడు ఆ వివాదం సర్దుమణగడంతోనే బ్యాన్ ఎత్తివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా, కంగనాపై అశోక్ పండిట్ చేసిన ఈ "నోటికొచ్చినట్టు మాట్లాడతావు" అనే కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story