Ashu Reddy: అషురెడ్డి ఎంగేజ్మెంట్.. అందర్ని గొర్రెల్ని చేసింది కదా మామ
Ashu Reddy: 9 కోట్ల ఆర్థిక మోసం ఆరోపణల మధ్య అషురెడ్డి ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని, వెబ్ సిరీస్ ప్రమోషన్ అని తేలిపోయింది.
Ashu Reddy: అషురెడ్డి ఎంగేజ్మెంట్.. అందర్ని గొర్రెల్ని చేసింది కదా మామ
Ashu Reddy Engagement: సోషల్ మీడియా సెన్సేషన్, యాంకర్ అషురెడ్డి పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఆర్థిక ఆరోపణలతో వార్తల్లో నిలిచిన అషు, తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలతో నెట్టింట పెద్ద దుమారమే లేపింది. అయితే, ఆ ఉంగరాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపడటంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.
9 కోట్ల మోసం..
కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కారు, బంగ్లాల పేరుతో అషురెడ్డి దాదాపు 9 కోట్లు వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. అషురెడ్డితో పాటు ఆమె తల్లి, అక్క కలిసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడిని ట్రాప్ చేశారని, ఒకరి నుంచి డబ్బులు వాడుకుంటూ మరొకరితో రిలేషన్‌లో ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. దీనికి సంబంధించి అషు బెదిరింపులకు పాల్పడినట్టు ఉన్న ఒక ఆడియో కూడా వైరల్ కావడంతో వ్యవహారం ముదిరింది.
అందరూ గొర్రెలేనా?
ఈ గొడవ సాగుతుండగానే, అషురెడ్డి సోషల్ మీడియాలో ఒక రింగ్ ఫోటోను షేర్ చేస్తూ తనకు ఎంగేజ్మెంట్ అయినట్టు సంకేతాలిచ్చింది. దీంతో, ఆమె నిజంగానే రిలేషన్‌లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని అందరూ భావించారు. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అది నిజమైన ఎంగేజ్మెంట్ కాదు, కేవలం ఒక వెబ్ సిరీస్ షూటింగ్ సీన్ అని తేలిపోయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో భాగంగా బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడితో కలిసి అషురెడ్డి ఉంగరాలు మార్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది.
నెటిజన్ల ఆగ్రహం
పెద్ద ఎత్తున మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, ఇలాంటి ఫేక్ ఎంగేజ్మెంట్ పోస్టులతో పబ్లిసిటీ స్టంట్లు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివాదాలను పక్కదారి పట్టించడానికి అందర్నీ గొర్రెల్ని చేస్తున్నావా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవైపు పోలీస్ కేసు, మరోవైపు వెబ్ సిరీస్ ప్రమోషన్లతో అషురెడ్డి వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.




