Avatar: అవతార్ 4, 5 ఎప్పుడు వస్తున్నాయో తెలుసా? డిస్నీ చెప్పిన తేదీలివే..!
Avatar: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న అవతార్ సిరీస్‌లోని 4వ చిత్రం 2029 డిసెంబర్ 21న, 5వ చిత్రం 2031 డిసెంబర్ 19న థియేటర్లలో విడుదల కానున్నాయని డిస్నీ సంస్థ ప్రకటించింది.
Avatar: అవతార్ 4, 5 ఎప్పుడు వస్తున్నాయో తెలుసా? డిస్నీ చెప్పిన తేదీలివే..!
Avatar: అవతార్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న సీక్వెల్స్ రిలీజ్ తేదీలను డిస్నీ సంస్థ ప్రకటించింది. 2029 డిసెంబర్ 21న అవతార్ 4ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తామని తెలిపింది. 2031 డిసెంబర్ 19న అవతార్ 5 విడుదల కానుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో డిస్నీ ఈ వివరాలను వెల్లడించింది.
ఈ రెండు చిత్రాలను హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్నారు. 2009లో అవతార్ 1, 2022లో అవతార్ 2 రిలీజ్ అయ్యాయి. 2025లో అవతార్ 3 థియేటర్లలోకి వచ్చింది. ఈ సిరీస్‌లో తొలి రెండు చిత్రాలు కలిపి 5.2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించాయి.
ఈ తేదీలు కొత్తగా నిర్ణయించినవి కావు. 2023 జూన్‌లో డిస్నీ అవతార్ సినిమాల షెడ్యూల్‌ను మార్చింది. అప్పుడే అవతార్ 3ను 2025 డిసెంబర్‌కు వాయిదా వేసింది. అవతార్ 4ను 2026 నుంచి 2029 డిసెంబర్ 21కి మార్చింది. 2028 డిసెంబర్ 22న అనుకున్న అవతార్ 5ను 2031 డిసెంబర్ 19కి మార్చింది. ఇప్పుడు అవే తేదీలను మరోసారి ధ్రువీకరించింది. అవతార్ సిరీస్ నిర్మాత రే సాంచిని మాట్లాడుతూ 4, 5 చిత్రాల పనులు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. అయితే ప్రస్తుత రిలీజ్ తేదీలు తాత్కాలికమేనని కూడా ఆమె పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో కూడిన ఈ చిత్రాల నిర్మాణ ప్రణాళికలను మరింత విస్తరించాల్సి ఉందని తెలిపారు.
అవతార్ 4 గురించి కామెరూన్ గతంలో కీలక విషయం చెప్పారు. సినిమా మొత్తాన్ని డిజైన్ చేసినా, ఇప్పటివరకు తొలి భాగాన్ని మాత్రమే చిత్రీకరించామని ఆయన తెలిపారు. అవతార్ 4, 5 చిత్రాలకు తాను దర్శకత్వం వహించకపోవచ్చని కూడా గతంలో అన్నారు. అవతార్ సిరీస్‌లో జేక్ సలీ పాత్రలో సామ్ వర్తింగ్టన్, నేయిత్రి పాత్రలో జో సాల్డానా కనిపిస్తున్నారు. ఇవి 2031 నాటికి సిరీస్‌ను ముగించే చిత్రాలు కానున్నాయి. తొలి భాగం వచ్చిన 22 ఏళ్ల తర్వాత ఈ కథ పూర్తవుతుంది.



